Artist Jeevitha : సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హీరోయిన్లు మొదటిసారి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తమ జీవితంలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నవారే . అయితే కొందరు వాటిని బయట పెడుతున్నారు. మరి కొంతమంది అవకాశాలు రావేమో అన్న భయంతో బయటకు చెప్పుకోవడం లేదు. ఇకపోతే మరికొంతమంది హీరోయిన్లలో ఈ మధ్యకాలంలో చాలా మార్పు వచ్చింది. ఎలాంటి లైంగిక వేధింపులకు గురైన సరే నిర్భయంగా బయటకు చెప్పుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఒక తమిళ నటి కూడా తనకు జరిగిన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. కడైకుట్టి సింగం సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న నటి జీవిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది.. “నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఒక దర్శకుడు వద్దకు ఆడిషన్ కి వెళ్లాను. ఆయన హీరోయిన్గా నాకు ఆఫర్ ఇస్తా అన్నాడు.. పారితోషకం కూడా ఎక్కువగా ఇస్తా అన్నాడు .
వరుస అవకాశాలు వచ్చేలా చేస్తా అన్నాడు. అయితే వాటికి బదులుగా తాను చెప్పినట్లుగా సర్దుకుపోవాలి అని , డైరెక్టర్ , కెమెరామెన్, మేనేజర్, నిర్మాత ఇలా ఎవరు పిలిస్తే వారి దగ్గరకు వెళ్లాలి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రూమ్ కి వెళ్ళాలి అంటూ చెప్పాడు.
ఇక అప్పుడే నాకు అనుమానం మొదలైంది. అవమానంగా అనిపించింది. వెంటనే మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాను అంటూ తెలిపింది జీవిత. ఇకపోతే జీవిత చేసిన ఈ కామెంట్లు నెట్ ఇంట చాలా వైరల్ గా మారుతున్నాయి.