Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మైథలాజికల్ పాన్ ఇండియా చిత్రం శాకుంతలం.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శకుంతలగా సమంత నటిస్తుండగా.. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు మోహన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.. అంతేకాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచేశాయి. ఈ చిత్రం ఏప్రిల్ 14న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత సుమతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో సమంత చేసిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఇంటర్వ్యూలో సెట్ కూడా ప్రకృతిని తలపించే విధంగా.. మనసుకు హాయి కలిగించే లాగా డిజైన్ చేశారు. ఈ క్రెడిట్ అంతా నాదే అని సుమ తెలిపింది.. అయితే ఈ సినిమా రోల్ మీరు ఎందుకు ఎంచుకున్నారు ఏమైనా ఇబ్బంది పడ్డారా అని అడగగా.. నేను అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రాజీ పాత్ర నటించాను. అలాగే యశోద సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించాను. ఆ రెండు సినిమాలలో కూడా యాక్షన్ ఫైట్ సీన్స్ ఉంటాయి. కానీ ఈ చిత్రం చాలా డిఫరెంట్. పైగా నాకు క్లాసికల్ డాన్స్ రాదు. ఈ సినిమా ఎంచుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాను.
వాస్తవానికి ఫస్ట్ నేను నో అని కూడా చెప్పేశాను. కానీ గుణశేఖర్ నన్ను ఒప్పించారు. ఇది నాకు చాలా కష్టమైన పని పైగా నాకు భయం వేసింది. గత మూడు సంవత్సరాలుగా నాకు భయం వేసింది అంటే.. ఆ పని నేను కచ్చితంగా చేయాల్సిందే. ఆ భయాన్ని మనం దాటాలి ప్రతిరోజు నేను భయపడతాను. నేను భయపడతాను కానీ.. నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రతినిత్యం చేస్తూనే ఉంటాను. గత మూడు సంవత్సరాలుగా నన్ను గమనిస్తే అది యాక్టింగ్ విషయంలో కానీ.. పర్సనల్ లైఫ్ లో కానీ మీకు స్పష్టంగా కనిపిస్తుంది అని సమంత అన్నారు. సమంత ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు సుమ కూడా ఎమోషనల్ గా మాట్లాడుతూ సపోర్ట్ చేసింది.
శకుంతలం సినిమాలో నేను ప్రిన్సెస్ లాగా కనిపించాలి. ఈ సినిమాలో ఫిజికల్ ఆస్పెక్ట్ అనేది అవసరం లేదు. చాలా అందంగా బ్యూటిఫుల్ గా కనిపించాలి. సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కూడా నన్ను అందంగా అద్భుతంగా ప్రజెంట్ చేసుకోవాలి. ఈ సినిమా తన కెరీర్లో చేసిన బెస్ట్ పాత్రలలో ఒకటిగా శాకుంతల పాత్ర నిలిచిపోతుందని. ఇటువంటి గొప్ప పాత్ర చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపింది సమంత. ఈ సినిమాలో ప్రతి ఎమోషన్ ని ఒక గ్రేస్, డిగ్నిటీతో చేయాలని నేను అదేవిధంగా చేశానని ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని సమంత అన్నారు.