Actor Ajith : తమిళ నాడు లో తిరుగులేని కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే నేటి తరం లో తలా అజిత్ అని సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్పేయొచ్చు.ముఖ్యంగా యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో అజిత్ కి ఉన్న క్రేజ్ వేరు,ఆయన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెవిన్యూ దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి.ఆయనకీ సంబంధించి ఏ చిన్న విషయం అయినా కోలీవుడ్ మొత్తం హాట్ టాపిక్ గా మారిపోతాది.

మంచి విషయాలను అభిమానులు ఒక పండుగ లాగా ఎలా అయితే జరుపుకుంటారో, ఆయనకీ సంబంధించి చెడు వార్తలకు కూడా అదే విధంగా బాధ పడుతారు.తమ సొంత ఇంట్లో వాళ్లకి ఏదైనా జరిగితే ఎంత బాధపడుతారో,కుమిలిపోతారో అజిత్ విషయం లో కూడా ఫ్యాన్స్ అంత వ్యక్తిగతంగా తీసుకుంటారు.ఇప్పుడు సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.

అజిత్ తాను దైవంగా భావించే తన కన్నతండ్రి పీ.సుబ్రహ్మణ్యం నేడు స్వర్గస్తులు అయ్యాడు.కొంత కాలం నుండి అనారోగ్యం తో బాధపడుతున్న సుబ్రహ్మణ్యం నేడు పరిస్థితి తీవ్రంగా విషమించడం తో తుది శ్వాస విడవాల్సి వచ్చింది.అందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉండే అజిత్ ముఖం లో విచారం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.ఇప్పటికే పలువురు తమిళ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు అజిత్ ఇంటికి చేరుకొని సంతాపం తెలిపారు.ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలను మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.
