Star Maa : సాధారణంగా ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు.. ఆ పండుగను పురస్కరించుకొని బుల్లితెర సెలబ్రిటీలంతా ఒకచోట చేరి పండగ వాతావరణాన్ని ముందే తీసుకొస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉగాది పండుగ రానున్న నేపథ్యంలో “మా ఇంటి ఉగాది” అంటూ ఒక స్పెషల్ షో చేస్తున్నారు స్టార్ మా నిర్వహాకులు.. ఈ క్రమంలోనే మా ఇంటి ఉగాది కార్యక్రమం నుంచి చిన్న ప్రోమోను విడుదల చేశారు.u ఈ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాని దసరా టీం సందడి చేశారు.

బుల్లితెర సెలబ్రిటీలతోపాటు నాని , రవితేజ ల సందడి మామూలుగా లేదు.. ఓ రేంజ్ లో రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా మనం ఈ ఉగాది ప్రోమోను గనుక గమనించినట్లయితే .. ఈసారి కనివిని ఎరుగని రీతిలో ఏకంగా బుల్లితెరకు చెందిన 12 కుటుంబాలతో చాలా గట్టిగా ప్లాన్ చేశారు స్టార్ మా నిర్వాహకులు. ముఖ్యంగా ఈ షో కి హోస్టుగా రవి, వర్షిని వ్యవహరించారు. ఇక వీరితోపాటు బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ ఆయన కుటుంబంతో రాగా.. మరొకవైపు బిగ్ బాస్ సెలబ్రిటీలైన వాసంతి , బాల ఆదిత్య, గీతూ రాయల్, ముక్కు అవినాష్ తదితరులు ఈ షోలో సందడి చేశారు.

ముఖ్యంగా గీతూ రాయల్ తన ఫ్యామిలీతో స్టేజి పైకి రాగానే నవ్వులు పువ్వులు పూయించారు. ఆ తర్వాత బాబా భాస్కర్ కూడా తన భార్యతో షోకి హాజరయ్యారు. అలాగే యాంకర్ వర్షిని మీ భర్త ఎవరి కంట్రోల్లో ఉంటారు అని బాబా భాస్కర్.. భార్యని అడిగితే నా కంట్రోల్ లోనే అంటూ ఆమె సమాధానం చెప్పింది.. దీంతో వర్షిని మీ కంట్రోల్ లోనే ఉంటాడా అంటూ గట్టిగా అరిచేసింది. మరొకవైపు అందరూ భార్య కంట్రోల్ లోనే ఉంటారు రా అంటూ మాస్టర్ కౌంటర్ ఇచ్చారు బాబా భాస్కర్.
ఆ తర్వాత నాని దసరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పంచకట్టులో వచ్చి సందడి చేశాడు. నాని వస్త్రధారణ షోకే హైలెట్గా నిలిచింది. మొత్తానికి అయితే మా ఉగాది పండుగ ప్రోమో ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది.