Artist Kasthuri : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొందరికి వయసు మళ్లినకొద్ది వదిన, తల్లి, అత్త ఇలాంటి పాత్రలు వస్తుంటాయి. జయప్రద, జయసుధ, సుహాసిని.. ఇలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్లంతా ఇప్పుడు తల్లి పాత్రలతో అలరిస్తున్నారు. కానీ కొందరికి ఈ అవకాశాలు రావు.
అలాంటి నటీమణులంతా ఇప్పుడు బుల్లితెరను ఆశ్రయిస్తున్నారు. బుల్లితెరపై సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తున్నారు. అలా ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న అలనాటి తారల్లో ఒకరు కస్తూరి. టీవీ సీరియల్స్ లో.. అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్స్ లో కనిపిస్తూ తన హవా చాటుతోంది.
అమెరికాకు చెందిన కస్తూరి ప్రస్తుతం గృహలక్ష్మి అనే సీరియల్‌లో నటిస్తోంది. స్టార్ మా ఛానెల్ లో వస్తోన్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గృహలక్ష్మిలో కస్తూరి ప్రతి ఇంట్లో ఆడపడుచు పడే కష్టాలు పడుతూనే.. ఆత్మాభిమానంతో.. ఆత్మస్థైర్యంతో తన కుటుంబాన్ని, తన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూపించింది. ఈ పాత్రలో కస్తూరి నటనకు మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
కస్తూరి ఇప్పటికే 1991లో తమిళ చిత్రం ఆతా ఉన్ కోయిలీతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. 1996లో సూపర్ హిట్ చిత్రం భారతీయుడులో కమల్ హాసన్ చెల్లెలుగా నటించింది. ఈ సినిమాలో ‘పచ్చని చిలుకలు తోడుంటే’ పాటలో కస్తూరి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కస్తూరి అనే పేరు వినబడగానే.. ప్రేక్షకుల మదిలో గుర్తొచ్చేది పచ్చని చిలుకలు తోడుంటే అనే పాటే. ఆ పాటలో అంతగా ఆకట్టుకుంది కస్తూరి. ఆ తర్వాత కింగ్ నాగార్జున సరసన ‘అన్నమయ్య’ సినిమాలో నటించింది. ఆ తర్వాత అమెరికా వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
ఇక ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ కస్తూరి ఎంతో అందంగా అనుకువగా.. చాలా సంప్రదాయంగా కనిపించే కస్తూరి సినిమాల్లో నటించినప్పుడు చాలా ట్రెండీగా కొన్నిసార్లు బోల్డ్ గా కూడా ఉండేది. ప్రస్తుతం కస్తూరికి సంబంధించిన వింటేజ్ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో కస్తూరి కాస్త ఘాటుగానే తన అందాల ప్రదర్శన చేసింది.