Samantha : సౌత్ ఇండియా లో ఫిటినెస్ మీద ప్రత్యేకమైన శ్రద్ద పెట్టే స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత.ఈమె చేసే వర్కౌట్స్ హీరోలైన చేస్తారా అనే సందేహం రాక తప్పదు. ఎందుకంటే ఈమె రోజు మొత్తం లో అధికశాతం జిమ్ లోనే గడుపుతాది.మరీ అతిగా వర్కౌట్స్ చెయ్యడం వల్లే ఆమెకి ‘మయోసిటిస్’ అనే వ్యాధి సోకింది అని డాక్టర్లు సైతం నిర్ధారించారు.ఈ వ్యాధితో వల్ల ఆమె చావుని చాలా దగ్గర వరకు చూసి వచ్చింది.
అయితే కోట్లాది మంది అభిమానులు ఆశీస్సులు ఉండడం వల్ల ఆమె ఈ ప్రాణాంతక వ్యాధి నుండి బయటపడింది.షూటింగ్స్ లో పాల్గొంటూ యదావిధిగా తన బిజీ లైఫ్ లోకి అలవాటు పడిపోయింది.అయితే ఇప్పుడు ఈమె మళ్ళీ వర్కౌట్స్ బీభత్సంగా చెయ్యడం ప్రారంభించింది.ఆమె వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ప్రతీ రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటుంది.రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఫొటోలో ఆమెకి సిక్స్ ప్యాక్ రావడాన్ని చూసి అభిమానులు షాక్ కి గురయ్యారు.
హీరోలకు కూడా సిక్స్ ప్యాక్ అనేది ఎంతో కష్టమవుతున్న ఈ రోజుల్లో హీరోయిన్ అయ్యుండి కూడా సిక్స్ ప్యాక్ కోసం ట్రై చెయ్యడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.ప్రస్తుతం ఆమె అమెజాన్ ప్రైమ్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో ఈమె రా ఏజెంట్ గా కనిపిస్తుండడంతో ఫిట్నెస్ పరంగా కూడా స్ట్రాంగ్ గా ఉండాలనే ఉద్దేశ్యం తోనే ఆమె ఇంత కష్టపడుతుందని చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్.
ఏది ఏమైనా సమంత ని మళ్ళీ అంతే ఆరోగ్యవంతంగా చుర్రుగ్గా సినిమాల్లో పాల్గొనడం చూసి సమంత అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు.ఇది ఇలా ఉండగా తెలుగు లో ఈమె విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ లో కూడా ఆమె సమాంతరంగా పాల్గొంటుంది.