Keerthy Suresh : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అందం తో పాటుగా అద్భుతమైన అభినయం కనబర్చే హీరోయిన్స్ చాలా తక్కువగా ఉంటారు.వారిలో ఒకరే కీర్తి సురేష్. బాలనటిగా కెరీర్ ని ఆరంభించిన ఈమె ఆ తర్వాత మలయాళం లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి, ఆ తర్వాత తెలుగు లో నేను శైలజా అనే సినిమా ద్వారా మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది.ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో ఆమెకి వరుసగా అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి.
అనతి కాలం లోనే చూస్తూ ఉండగానే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.ముఖ్యంగా ‘మహానటి’ సినిమాలో ఈమె కనబర్చిన అద్భుతమైన నటనకి గాను నేషనల్ అవార్డు కూడా దక్కింది.నేటి తరం హీరోయిన్స్ లో నేషనల్ అవార్డుని అందుకున్న ఏకైక స్టార్ గా కీర్తి సురేష్ సరికొత్త చరిత్ర సృష్టించింది.డిమాండ్ మరియు క్రేజ్ ఉంది కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమాని ఒప్పుకోకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తూ ముందుకు దూసుకెళ్లింది.
అయితే ఇండియా లో ఉన్న అన్నీ ప్రాంతీయ బాషలలో మంచి డిమాండ్ ఉన్న ఈ కేరళ కుట్టి, ఒక్కో సినిమాకి మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.ఆమె కోసంగా థియేటర్స్ కదిలే ప్రేక్షకులు ఉండడం తో నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనకాడట్లేదు అట. అయితే ఆమె ఆస్తుల విలువ మొత్తం లెక్కగడితే 120 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇదంతా కేవలం కీర్తి సురేష్ సంపాదనే అట.
ఇంత తక్కువ సమయం లో ఈ రేంజ్ లో సంపాదించింది అంటే, రాబొయ్యే రోజుల్లో ఇంకా ఏ రేంజ్ కి వెళ్తుందో అని అనుకుంటున్నారు విశ్లేషకులు. ఇక రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘దసరా‘ చిత్రం ఈ నెల 30 వ తారీఖున పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో విడుదల కాబోతుంది.ఇందులో ఆమె పోషించిన వెన్నెల పాత్ర ఆమెకి మరో జాతీయ అవార్డు తెచ్చిపెడుతుందని ఫిలిం నగర్ లో ఒక టాక్ జోరుగా ప్రచారం సాగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.