Bandla Ganesh : తెలుగు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి అందరికి తెలిసిందే.. ఒకప్పుడు కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ నిర్మాత సినిమాలను నిర్మించారు.. సక్సెస్ అయ్యారు. కానీ ఎప్పుడు ఏదోక వార్తతో వార్తల్లో నిలుస్తున్నారు.. బండ్ల సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తెలుగు సినిమా ఇండస్ట్రీలో తరచుగా సోషల్ మీడియాలో వినిపించే పేర్లలో బండ్ల గణేష్ పేరు కూడా ఒకటి. సినిమాలలో నటించకపోయినప్పటికీ బండ్ల గణేష్ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటాడు. కాగా బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి మనందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, భక్తి అని చెప్పవచ్చు. అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

పవన్ కళ్యాణ్ పై సినిమాల పరంగా కానీ లేదంటే రాజకీయపరంగా కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లైవ్ మీడియాలోకి వచ్చి మరి తిట్టేస్తూ ఉంటాడు.. కాగా, పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ ఈవెంట్ కి తనకు ఆహ్వానం ఇవ్వలేదని బండ్ల గణేష్ త్రివిక్రమ్ పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. తర్వాత బండ్ల గణేష్ త్రివిక్రమ్ ను కలిసి స్వయంగా సారీ చెప్పినట్లు తెలిపారు.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ చేస్తున్న ట్వీట్లు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేస్తున్నాడని, పవన్ కి చురకలు అంటించే విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ వాదనలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే..

ఈ క్రమంలో బండ్లకు ఓ అభిమాని ఇచ్చిన సలహాతో దానిపై రియాక్ట్ అయిన బండ్ల గణేష్.. మన దేవుడు పవన్ కళ్యాణ్ మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం. ఏం చేద్దాం అంటూ ట్వీట్ చేయడంతో అది కాస్త సంచలనంగా మారింది. అయితే ఆ ట్వీట్ త్రివిక్రమ్ అనే ఉద్దేశించి పరోక్షంగా డాలర్ శేషాద్రి అనే మాట అన్నారు అంటూ వార్తలు ఊపందుకున్నాయి.. దాన్ని చూసిన కొందరు తీవ్రంగా మండిపడుతున్నారు.. అస్సలు బండ్ల ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి బండ్ల ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.. మరి దీనిపై బండ్ల ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి..