Eesha Rebba: ఈషా రెబ్బా.. ఈ తెలుగు అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే..పేరు వినగానే చూడ చక్కనైన ఆమె రూపం గుర్తుకొస్తుంది .. గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలలో కూడా నటించింది.. తన నటనా ప్రతిభ నిరూపించింది ఈ ముద్దుగుమ్మ. మీడియం రేంజ్ చిత్రాలలో విభిన్నమైన పాత్రలు చేస్తూ అందర్నీ అలరిస్తున్న ఈమె కమర్షియల్ చిత్రాలలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. మంచిగా అవకాశం దొరికితే నిరూపించుకోవడానికి సిద్ధంగా వుంది.అంతే కాదు గ్లామర్ పరంగా కూడా తిరుగులేని బ్యూటీగా పేరుపొందింది.

సాధారణంగా తెలుగు అమ్మాయిలకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా మాత్రం తన ప్రతిభా గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడం నిజంగా విశేషం అని చెప్పాలి. గ్లామర్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ అందుకు సంబంధించిన ఫోటోల ద్వారా సంకేతాలు పంపుతుంది. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే గ్లామర్ ఫోటోలకు కుర్రాళ్ళు కూడా ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీర కట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బ ట్రెండిగా మోడ్రన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ లో అదరగొడుతుంది.

ఇక తాజాగా కుర్రాళ్ళు హై ఫీవర్ కి గురయ్యేలా ఘాటైన నడుము సొగసుతో వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు. జీబ్రా కలర్ బ్లౌజ్ ధరించి బ్లాక్ సారీలో తన అందాలను చూపిస్తూ యువతను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. బ్లాక్ సారీ వైట్ బ్లౌజ్ లో డెడ్లీ కాంబినేషన్ అనిపించేలా గమ్మత్తైన పూజలు ఇచ్చింది. మొత్తానికి అయితే ఈ ఫోటోలు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.