Hansika Motwani : నిమిషానికి 5 లక్షలా..! హీరోయిన్ హన్సిక తల్లి మామూలు ముదురు కాదుగా

- Advertisement -

Hansika Motwani : బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి హన్సిక.తెలుగు తమిళం బాషలలో ఈమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. కుర్రాళ్ళు ఈమె అందానికి మరియు నటన కి దాసోహం అయిపోయారు.పూరి జగన్నాథ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘దేశముదురు’ అనే సూపర్ హిట్ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది హన్సిక.

Hansika Motwani
Hansika Motwani

ఆ తర్వాత ఈమె తెలుగు, తమిళం ,హిందీ మరియు మలయాళం బాషలలో టాప్ లీడింగ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.చూస్తూ ఉండగానే ఈమె టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయి సుమారుగా 50 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఆమె తన ప్రియుడు మరియు ప్రముఖ పారిశ్రామిక వేత్త సోహైల్ ని పెళ్లాడింది.డిసెంబర్ 4 వ తేదీ 2022 వ సంవత్సరం లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు.

Hansika Motwani marriage

ఈ వివాహ వేడుక లవ్ షాదీ డ్రామా పేరిట డిస్నీ + హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే హన్సిక తల్లి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన అల్లుడు సోహైల్ కుటుంబం తో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకుంది, ఆమె మాట్లాడుతూ ‘పెళ్లి రోజు సోహైల్ మరియు అతని కుటుంబం ముహూర్తం సమయానికి రాలేకపోయారు బాగా లేట్ అయిపోయింది.ఏమి జరుగుతుంది అనే కంగారు తో సోహైల్ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.

- Advertisement -
Hansika Mother

ఇక నుండి ఆలస్యం అయితే నిమిషానికి 5 లక్షల చొప్పున ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరించాను’ అంటూ హన్సిక వాళ్ళ అమ్మ మోనా ఈ సందర్భంగా తెలిపింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.పెళ్ళైన తర్వాత కూడా హన్సిక వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తుంది. వీటితో పాటు రెండు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది ఈ బ్యూటీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here