RRR Movie బాలయ్య – ఎన్టీఆర్ తో తియ్యాలి అనుకున్నారా..షాకింగ్ నిజాలు బయటపెట్టిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్

- Advertisement -

RRR Movie : ఏదైనా ఒక సినిమా ఒక డైరెక్టర్ తియ్యాలి అని అనుకున్నప్పుడు ముందుగా ఇద్దరు ముగ్గురు హీరోలను తన కథకి సరిపోతాడా లేదా అనేది చూసుకుంటారు. ఆ తర్వాతే కొన్ని స్కెచులు వేసుకొని ఒక ఐడియా కి వస్తారు.ఆస్కార్ అవార్డు గెలుచుకున్న #RRR విషయం లో కూడా అదే జరిగింది.రీసెంట్ గా ఆ చిత్ర రచయితా విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో #RRR గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

RRR Movie
RRR Movie

ఆయన మాట్లాడుతూ ‘#RRR కథని ముందుగా అనుకున్నప్పుడు రామ్ చరణ్ – ఎన్టీఆర్ పేర్లు మాకు తట్టలేదు.రామ్ చరణ్ మరియు చిరంజీవి కాంబినేషన్ లో చేద్దామా, లేదా ఎన్టీఆర్ మరియు బాలయ్య కాంబినేషన్ లో చేద్దామా, సూర్య – కార్తీ కాంబినేషన్ లో చేద్దామా , ఇలా ఎన్నో కాంబినేషన్స్ ని అనుకున్నాము.కానీ రాజమౌళి వేరే హీరోలతో అయితే ఈగో క్లాష్ వచ్చే అవకాశం ఉంది, నాకు రామ్ చరణ్ ,ఎన్టీఆర్ మొదటి నుండి బాగా క్లోజ్, వాళ్ళతో అయితే నేను బాగా కంఫర్ట్ ఫీల్ అవుతాను అని చెప్పాడు.అలా ఈ సినిమా పుట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు విజయేంద్ర ప్రసాద్.

RRR Movie For Oscars

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నిజజీవితం లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ చాలా తేలికగా సెట్ అయిపోయింది అంటూ విజయేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.ఇన్ని రోజులు ఆస్కార్ ప్రొమోషన్స్ తో ఫుల్ బిజీ అయినా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇప్పుడు తమ సినిమాల షూటింగ్స్ తో బిజీ కానున్నారు.రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ లో నిన్ననే పాల్గొన్నాడు.

- Advertisement -
NTR Ram Charan

ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ నెల 23 వ తారీఖున కొరటాల శివ తో చెయ్యబొయ్యే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నాడు. అలా ఈ ఇద్దరి హీరోలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. మళ్ళీ వీళ్లిద్దరు కలిసి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, కలిసి తిరగడం వంటివి జరిగేది #RRR పార్ట్ 2 అప్పుడే.ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ ఇది వరకే తెలియజేసాడు. మహేష్ తో చెయ్యబొయ్యే సినిమా పూర్తైన తర్వాతే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

Naatu Naatu
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here