Alekhya Reddy : ‘నా భర్తని బ్రతికి ఉన్నన్ని రోజులు హింసించారు’ అంటూ సంచలన కామెంట్స్ చేసిన తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి

- Advertisement -

Alekhya Reddy : నందమూరి తారకరత్న చనిపోయిన తర్వాత ఆయన గురించి సోషల్ మీడియా లో ఎన్నో కథనాలు ప్రచారం అవుతూనే ఉన్నాయి.బ్రతికి ఉన్న రోజుల్లో ఆయన ఎలాంటి కష్టాలను అనుభవించాడో, అతనిని కుటుంబ సభ్యులు ఎంత బాధలు పెట్టారో, ఇలాంటివి అన్ని రోజూ సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉన్నాయి.ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అయితే ప్రతీ రోజు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తన భర్త ను తల్చుకుంటూ బాధపడుతూనే ఉంది.

Alekhya Reddy
Alekhya Reddy

ఆమె బాధను చూసి అభిమానులు ఎలా ఓదార్చాలో తెలియక , ఆమె బాధ చూడలేక నరకం అనుభవిస్తున్నారు. కేవలం కామెంట్స్ తోనే ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.ఈరోజు లేటెస్ట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఒక పోస్టు తెగ వైరల్ గా మారింది. అందులో తారకరత్న ని బ్రతికి ఉన్నన్ని రోజులు ఆయన తల్లితండ్రులు ఎంత మానసిక వేదనకి గురి చేసారో చెప్పుకొచ్చింది.

Alekhya Reddy

ఆమె మాట్లాడుతూ ‘మన ఇద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు నేను చాలా భయపడేదానిని. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎన్ని అవమానాలను ఎదురుకోవాలో, ఎంతమందిని కోల్పోవాలో అని.కానీ నువ్వు మాత్రం అన్నిటికి తెగించి పెళ్లి చేసుకోవడానికే సిద్ద పడ్డావు. మన పెళ్లి వల్ల సొంత కుటుంబం లో ఉన్నవాళ్లే శత్రువులు అయ్యారు. వాళ్ళు మన ఇద్దరినీ ఎంత మానసిక వేదనకు గురి చేసారో, మనం ఎన్ని అవమానాలను ఎదురుకున్నామో మనకి మాత్రమే తెలుసు.మనకంటూ ఒక పెద్ద కుటుంబం ఉండాలని పిల్లల్ని కన్నాము, వాళ్ళు పుట్టిన తర్వాత మన జాతకమే మారిపోయింది. మన జీవితాల్లో సంతోషం మొదలైంది. అంతా సుఖంగా సాగిపోతుంది అని అనుకుంటున్నా సమయం లో నువ్వు మమల్ని వదిలి వెళ్ళిపోయావు. నిన్ను తలచుకొని క్షణం అంటూ లేదు, మళ్ళీ తిరిగి నా దగ్గరకి వచ్చేయి’ అంటూ ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here