Kabzaa Review : ఇటీవల కాలం లో మన టాలీవుడ్ తో పాటుగా మంచి మార్కెట్ ని ఏర్పర్చుకున్న చిత్ర పరిశ్రమ ఏదైనా ఉందా అంటే అది కన్నడ సినీ పరిశ్రమ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈ ఇండస్ట్రీ నుండి వచ్చిన KGF సిరీస్ మరియు ‘కాంతారా’ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టాయి.దీనితో కన్నడ నుండి ఒక సినిమా విడులా అవుతుంది అంటే కనీస స్థాయి అంచనాలు ఉండడం సహజం అయిపోయింది.అలా లేటెస్ట్ గా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైంది ‘కబ్జా’ చిత్రం.కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరో గా నటించిన ఈ సినిమాలో సుదీప్ , శివరాజ్ కుమార్ వంటి కన్నడ సూపర్ స్టార్స్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు.అలా భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను మరియు ప్రేక్షకులను అలరించిందో లేదో ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
ఈ చిత్రం కథ మొత్తం 1942 నుండి 1986 మధ్యలో జరిగినది.దేశం కోసం బ్రిటిషర్లతో వీరోచితంగా పోరాడి ప్రాణాలను అర్పించిన ఒక మహాత్మా గాంధీ వీరాభిమాని కొడుకు కథ ఇది.ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య పుట్టిన ఆర్కేశ్వర(ఉపేంద్ర )మాఫియా లీడర్ గా ఎదుగుతాడు.తండ్రి స్వతంత్ర సమరయోధుడు అయితే , కొడుకు ఆర్కేశ్వర మాత్రం దండాలు,దౌర్జన్యాలు చేస్తూ ఇందులోనే మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ గా మారుతాడు.అతను అలా మారడానికి కారణం ఏమిటి..?, చివరికి మంచి మనిషిగా మారి తండ్రిలాగానే ఫ్రీడమ్ ఫైటర్ అవుతాడా, లేదా అలా డాన్ గానే కొనసాగుతాడా అనేది వెండితెర మీదనే చూడాలి.
విశ్లేషణ:
ఈ చిత్రాన్ని ఉపేంద్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించాడు.ఆయన కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం గా తెరకెక్కింది.సుమారుగా 120 కోట్ల రూపాయిలను ఖర్చు చేసినట్టు సమాచారం.వాస్తవానికి ప్రస్తుతం ఉపేంద్ర కి అంత మార్కెట్ లేదు, కానీ కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులను ఆదరిస్తారు అనే ఉద్దేశ్యం తోనే ఈ చిత్రాన్ని అంత భారీ గా తెరకెక్కించాడు డైరెక్టర్ చంద్రు.అతను అనుకున్న విధంగా కంటెంట్ లో దమ్ము ఉంది, కానీ స్క్రీన్ ప్లే టేకింగ్ లో మాత్రం ఆ చురుకుదనం కనిపించలేదు.ప్రథమార్థం మొత్తం నీరసంగానే కొనసాగుతుంది.కనీసం ద్వితీయార్థం లో అయినా స్క్రీన్ ప్లే లో ట్విస్టులు ,ఎమోషనల్ కనెక్ట్ ఉంటుందేమో అని అనుకున్నారు, కానీ సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుంది అనే ఫీలింగ్ సినిమా మొత్తం చూసిన తర్వాత ఆడియన్స్ కి కలిగే అనుభూతి.
కానీ ఈ సినిమా మొత్తానికి ఉపేంద్ర నటనే హైలైట్ అని చెప్పాలి.డైరెక్టర్ టేకింగ్ విషయం లో తేలిపోయినప్పటికీ, చాలా సన్నివేశాలను ఉపేంద్ర తన నటనతోనే ఎలివేట్ చేసే ప్రయత్నం చేసాడు.ఇక ఈ చిత్రం లో స్పెషల్ రోల్ చేసిన సుదీప్ కేవలం పది నిమిషాలు మాత్రమే తెరపై కనిపిస్తాడు.ఆయన పాత్ర బాగుంది,ఇంకా కాసేపు ఉంది ఉంటే పర్వాలేదు అనిపించింది.ఇక కన్నడ సూపర్ స్టార్స్ లో ఒకరైన శివరాజ్ కుమార్ కూడా ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించాడు.హీరోయిన్ శ్రేయ , ప్రకాష్ రాజ్ , మనోజ్ బాజ్ పేయ్, మురళి శర్మ తదితరులు తమ పరిధిమేర పర్వాలేదు అనే రేంజ్ లో నటించారు.మొత్తానికి ఈ చిత్రం లో ఉన్న కథని ఎంతో గొప్పగా తెరకెక్కించొచ్చు.కానీ డైరెక్టర్ అందులో దారుణంగా విఫలం అయ్యాడు.
చివరి మాట : అభిమానులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.. అంచనాలు పెట్టుకొని వెళ్తే మాత్రం బాగా నిరాశకి గురి అవుతారు.
నటీనటులు : ఉపేంద్ర , సుదీప్ , శివ రాజ్ కుమార్, శ్రియ శరన్ , మురళి శర్మ , మనోజ్ భాజపేయ్ , ప్రకాష్ రాజ్
డైరెక్టర్ : R.చంద్రు
సంగీతం : రవి బస్రూర్
నిర్మాతలు : R .చంద్రు , అలంకార్ పాండియన్ , ఆనంద్ పండిట్
రేటింగ్ : 2.25/5