Meena ఈ వయస్సు లో కూడా ఆ హీరో పై మోజుపడిన సీనియర్ హీరోయిన్ మీనా

- Advertisement -

Meena : బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిన హీరోయిన్స్ లో ఒకరు మీనా.చిన్నతనం లోనే ముద్దులొలికే నటన తో అందరినీ మెప్పించిన మీనా, పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అనతి కాలం లోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. తెలుగు మరియు తమిళం కలిపి చిరంజీవి , నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, రజినీకాంత్ మరియు కమల్ హాసన్ ఇలా అందరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఒక వెలుగు వెలిగింది మీనా.

Meena
Meena

కెరీర్ లో ఎవ్వరు అందుకోలేనంత రేంజ్ కి వెళ్లి పీక్ పీరియడ్ ని ఎంజాయ్ చేస్తున్న మీనా 2009 వ సంవత్సరం లో బెంగళూరుకు చెందిన వ్ విద్యాసాగర్ అనే అతనిని పెళ్లాడింది, వీళ్లిద్దరికీ నైనికా అనే కుమార్తె కూడా ఉంది. ఆమె గతం తమిళ హీరో విజయ్ నటించిన ‘తేరి’ చిత్రం లో విజయ్ కూతురిగా నటించింది.

Actress Meena

అయితే దురదృష్టం కొద్దీ ఆమె భర్త విద్యాసాగర్ గత ఏడాది జూన్ నెలలో స్వర్గస్తులయ్యాడు. ఆ బాధ నుండి మీనా పూర్తిగా తేరుకొని కుటుంబాన్ని పోషించడం కోసం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా గడిపేస్తుంది. ప్రస్తుతం మీనా చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా మీనా సినిమా ఇండస్ట్రీ కి వచ్చి 40 ఏళ్ళు అవుతుందట. ఈ సందర్భంగా ఆమె ఒక తమిళ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన క్రష్ గురించి చెప్పుకొచ్చింది.

- Advertisement -
Meena family

ఆమె మాట్లాడుతూ ‘నాకు హృతిక్ రోషన్ అంటే పిచ్చి గా ఉండేది, నా ఏకైక క్రష్ అతనే. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయం లో నాకు హృతిక్ రోషన్ లాంటి అబ్బాయిని చూడమని చెప్పేదాన్ని , అతనిని పెళ్లి అయిపోయింది అనే వార్త వినగానే నా గుండె బద్దలు అయ్యింది’ అంటూ హృతిక్ రోషన్ పై తనకి ఉన్న క్రష్ గురించి చెప్పుకొచ్చింది మీనా. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వయస్సులో కూడా ఇలాంటి కోరికలు ఉన్నాయా అంటూ మీనాపై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Meena
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here