Holi Songs : ప్రతి ఒక్కరు జరుపుకొనే పండుగలలో ఒకటి హోళి.. వయస్సు తో సంబంధం లేకుండా రంగులతో సంతోషాన్ని వెతుక్కుంటారు.ఇంద్రధనస్సు రంగులను ఒకరిపై మరొకరు చల్లుకుంటూ వేడుకలను జరుపుకుంటారు..ఎండాకాలం వచ్చే ముందు వచ్చే పండుగ ఈ హోళి..హోళికా దహనం చేసి రంగులతో నిండిపోతారు.. ఇక తెలుగులో హోళి సందర్బంగా వచ్చిన పాటలు ఏంటో ఈరోజు విందాం పదండీ..
ప్రభాస్, చార్మి జంటగా వచ్చిన చక్రం సినిమాలో హోళి సందర్బంగా వచ్చిన పాట సిరివెన్నెల రాసిన రంగేలీ హోలీ పాట సూపర్ హిట్ ఉంటుంది. ప్రభాస్, చార్మీలు రంగుల వర్షంలో తడిసారు .
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమాలో కూడా రంగు రబ్బా రబ్బా అంటుంది రంగు భరిసే అంటూ వచ్చిన పాట కూడా జనాలను తెగ ఆకట్టుంది.
హీరో, డైరెక్టర్ లారెన్స్ తెరకేక్కించిన నాగార్జున హీరోగా వచ్చిన సినిమా మాస్ లో కూడా కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనే లైఫ్ ఉందిరా.. అనే పాటను సాహితి రాసిన ఈ పాట జనాలను రంగుల్లో ముంచేసింది.
మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాలోనూ హోలీహోలీ పండగల్లే ఉల్లాసమేదో ఉప్పొంగుతుంది నాలో అని చల్లుకున్నాడు. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తమన్నాతో కలిసి రంగులు చల్లుకున్నాడు.
అలాగే సీతారామ రాజు సినిమాలో రంగులు పూసుకున్నాడు. నందమూరి హరికృష్ణతో కలిసి ఈ సినిమాలో కూడా హోలీ సంబరాలు చేసుకున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయకుడు సినిమాలో కమల్ హాసన్ రంగులు జల్లుకున్నారు. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పదరేళ్ల వయసు సినిమాలో వయస్సంత ముడుపుకట్టి.. వసంతాలే ఆడుకుందాం.. వెంకటేష్ జెమిని సినిమాలో వచ్చిన దిల్ దీవానా అనే సాంగ్ జనాలను బాగా మెప్పించింది..
విజయ్ దేవరకొండ, మెహ్రీన్ లతో ఒక స్పెషల్ హోళి సాంగ్ కూడా జనాల్లో మంచి క్రేజ్ ను అందుకుంది..
ఇక పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో కూడా హోళి మీద పాట ఉంది..
ఇలా ఎన్నో పాటలు జనాలను మెప్పించాయి.. ప్రకృతి లో దొరికే రంగులను వాడితే మంచిదే.. రసాయనాలను వాడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి గుర్తుంచుకోండి..