Hari Hara Veeramallu పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’.సుమారు గా 200 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మాత AM రత్నం ఈ సినిమాని కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా మొత్తం మొఘల్ సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఇందులో బందిపోటు దొంగగా కనిపించనున్నాడు.
30 డిఫరెంట్ గెటప్స్ తో, మూడు డిఫరెంట్ లుక్స్ తో పవన్ కళ్యాణ్ ఇందులో కనిపించనున్నాడు.కోరమీసం తో ఉన్న లుక్స్ మాత్రమే కాకుండా, గుబురు గెడ్డం తో కూడా పవన్ కళ్యాణ్ ఇందులో కనిపించనున్నాడు.హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా ఈ చిత్రానికి రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు.ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా కొన్ని రోజులు, పవన్ కళ్యాణ్ యాక్టీవ్ పాలిటిక్స్ కారణంగా మరికొన్ని రోజులు వాయిదా పడి ఎట్టకేలకు షూటింగ్ ని జరుపులుంటూ చివరి దశకి చేరుకుంది.
ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్నట్టు టాక్.ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో పవన్ కళ్యాణ్ లేని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.పవన్ కళ్యాణ్ కి సంబంధించి మరో 30 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది.అది కూడా క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రమే.క్లైమాక్స్ లో కూడా ఆయన గుబురు గెడ్డంతోనే కనిపించనున్నాడు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ అభిమానులకు పూనకాలు రప్పించేలా చేస్తుంది.
అదేమిటంటే ఈ సినిమా ప్రీమియర్ షో హిందీ వెర్షన్ ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు అమిత్ షా కి ప్రత్యేక షోస్ ని ఏర్పాటు చేయబోతున్నారట.ఈ సినిమా మొత్తం నార్త్ ఆడియన్స్ హిందువులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతుందట.అందుకే హిందీ ప్రొమోషన్స్ విషయం లో ఎక్కడా కూడా తగ్గకుండా చూసుకోబోతున్నారట.పాన్ ఇండియా లెవెల్ లో కేవలం హిందీ మరియు తెలుగు ఆడియన్స్ ని మాత్రమే కాదు, ప్రతీ ప్రాంతీయ భాషలోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టించే రేంజ్ కంటెంట్ అని తెలుస్తుంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాని కేవలం ఒక్క భాగం గా కాకుండా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట.రెండు పార్టులుగా తీసే స్కోప్ ఉన్న కథ ఇది అని, కానీ రెండవ పార్ట్ మాత్రం మొదటి పార్ట్ ఫలితం ని బట్టే తీస్తారని తెలుస్తుంది.ఓరంగజేబు అరాచకాల మీద ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించబోతున్నారట.రాబొయ్యే నెల రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి, దసరా కి ఎలా అయినా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తో కలిసి వినోదయ్యా సీతం రీమేక్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఈ నెల 12 వ తారీఖు వరకు ఈ షూటింగ్ జరగనుంది.అనంతరం ఆయన ‘హరి హర వీరమల్లు’ సినిమా మీద ఫోకస్ పెట్టబోతున్నాడని తెలుస్తుంది.