Organic mama Hybrid Alludu Review : బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు.. ఈ చిత్రంలో సోహెల్ కి జోడిగా మృణాళిని రవి నటించింది.. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలవుగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.. తాజాగా నేడు మార్చి 3న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైంది.. ఈ సినిమా కథ ఏంటి.. ఈ సినిమాతో సోహెల్ హిట్ కొట్టాడా లేదా తెలుసుకుందాం..
కథ: రెండు ఫ్లాప్ సినిమాలు తీసిన దర్శకుడు విజయ్ (సోహెల్). ఆర్గానిక్ వెంకటరమణ (రాజేంద్రప్రసాద్) కూతురు హాసిని (మృణాళిని రవి) ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. ఆర్గానిక్ వెంకటరమణ తన కూతురు ఎవరితోనూ ప్రేమలో పడకూడదని అనుకుంటాడు కానీ తను అనుకున్నదే జరుగుతుంది.. హాసిని విజయ్ తో ప్రేమలో పడుతుంది. విజయ్ ప్రేమను వెంకట్ రమణ ఎలా తెలుసుకున్నాడు.. వీళ్ళ ప్రేమని ఆర్గానిక్ వెంకటరమణ ఒప్పుకున్నాడా.. లేదా.. హాసిని విజయ్ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారా లేదా అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే..
కామెడీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాతో చాలా కాలం తర్వాత ఎస్ వి కృష్ణారెడ్డి మళ్లీ ఫామ్ లోకి వచ్చారని చెప్పొచ్చు. ఎమోషనల్ , కామెడీ సీన్స్ లో మరోసారి ఆయన మార్క్ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోయింది. సోహెల్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. తను ఇవ్వగలిగినంత స్టఫ్ ఈ సినిమాకు మాత్రం ఇచ్చాడని చెప్పడంలో సందేహమే లేదు.. ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఇక ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది పాటలు పర్వాలేదు అనిపించాయి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త బెటర్ గా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది..
ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్లో నరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది. విజయ్ హాసిని మధ్య సాగే సీన్స్ కాస్త డల్ అవుతాయి. దీనికి తోడు వీళ్లిద్దరి మధ్య అనవసరమైన సన్నివేశాలు ఎక్కువగా కూడా ఉంటాయి. వీటికి తోడు మిగతా పాత్రలు కూడా నిదానంగా వెళ్తూ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో సాగదీసే ప్రయత్నాన్ని చేశారు. ఈ సినిమాలో మృణాళిని కూడా పాత్రకు న్యాయం చేసింది. కొన్ని లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్ లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి చాలా కాలం తర్వాత వచ్చినా కూడా ఈ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. సోహెల్ కి ఈ సినిమా చేదు అనుభవాన్ని ఇచ్చింది.
నటీనటులు : సోహెల్, మృణాళిని రవి, రాజేంద్రప్రసాద్, మీనా, సునీల్, ఆలీ, అజయ్ ఘోష్, సప్తగిరి, వరుణ్ సందేశ్ , రష్మీ, పృద్వి, రాజా రవీంద్ర, కృష్ణ భగవాన్, సురేఖ వాణి , హేమ, వైవా హర్ష, సన తదితరులు.
దర్శకుడు : ఎస్ వి కృష్ణారెడ్డి
నిర్మాత : కోనేరు కల్పన
సంగీత దర్శకుడు : ఎస్ వి కృష్ణారెడ్డి
సినిమా ఆటోగ్రాఫర్ : సి. రామ్ ప్రసాద్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి