Bhuma Mounika Reddy : మంచు మోహన్ బాబు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.. అందరూ అనుకుంటున్నట్టుగానే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి ని రెండో వివాహం చేసుకోబోతున్నాడు. ఈరోజు రాత్రి 8: 30 నిమిషాలకు కుటుంబ సభ్యుల తోపాటు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుంది. హైదరాబాద్ ఫిలింనగర్ లోని మనోజ్ సోదరి నటి మంచు లక్ష్మి ఇంట్లో ఈ వేడుక జరగనుంది. తాజాగా మనోజ్ తన భార్య ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ మనోజ్ చేసుకోబోయే భూమా మౌనిక రెడ్డి ఎవరు.. ఆమె ఆస్తుల విలువ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
దివంగత నేత భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి ల రెండవ కూతురు భూమా నాగ మౌనిక. ఏమిటి గతంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఐదు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. వారి మధ్య ఉన్న మనస్పర్ధలు కారణంగా మౌనిక అతనితో విడాకులు తీసుకుంది. ఆమె విడాకులు తీసుకున్న సమయంలోనే భరణంగా 250 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.
మౌనిక ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నారు. ఈమె చాలా తెలివైన వ్యక్తి. తన తండ్రి లాగానే ఆళ్లగడ్డ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. తనంతట తాను ఎవరిని పల్లెత్తు మాట అనదు కానీ.. తన జోలికి వస్తే మాత్రం కాస్త అగ్రేసివుగా రియాక్ట్ అవుతుంది. భూమా మౌనిక కి తన సోదరీ అఖిలప్రియ తో ఆస్తి వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నారు.
2018లో భూమా నాగ మౌనికకి మంచు మనోజ్ తో పరిచయం అయింది. మనోజ్ తరచూ సామాజిక సేవలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా మౌనికలతో మనోజ్ కి పరిచయం ఏర్పడింది. అలా వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. గతంలో వీళ్ళిద్దరూ కలిసి పూజలు చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లోనే వీళ్లిద్దరూ కలిసి ఒకే ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తగానాలు చక్కర్లు కొట్టాయి. కాగా సినిమా వారి గురించి ఇలా రాయడం సాధారణమే అని భావించి లైట్ తీసుకున్నారు.
భూమా మౌనిక ఆస్తుల విలువ సుమారు రూ. 2000 కోట్ల ఉంటుందని అంచనా. వీటితోపాటు మరికొన్ని విలువైన ప్రాపర్టీస్ కూడా భూమా మౌనిక పేరు మీద ఉన్నాయట.. ఇక మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోబోతున్నారు అంటే.. ఈ ఆస్తులన్నీ కూడా మంచు మనోజ్ కి చెందుతాయని.. ఆస్తి కోసమే మనోజ్ మౌనికని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరూ సెలబ్రిటీస్ కావడంతో ఇలాంటి వార్తలు పుట్టుక రావటం సహజమేనని వాళ్లు కొట్టి పారేస్తున్నారు.