Actress Ankitha ఇంత గా మారిపోయిందేంటి.. ఇప్పటి హీరోయిన్లు కూడా పనికిరారుగా!

- Advertisement -

Actress Ankitha ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ తర్వాత కూడా వరుసగా హిట్టు మీద కొట్టి కొట్టి అప్పట్లో హీరోల పాలిట లక్కీ హీరోయిన్ గా మారిన బ్యూటీ అంకిత. 2002 వ సంవత్సరం లో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అనే సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమానే సెన్సేషనల్ హిట్ అవ్వడం తో ఈమెకి అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి.

Actress Ankitha
Actress Ankitha

‘ధనలక్ష్మి ఐ లవ్ యూ’ , ‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘సింహాద్రి’ ఇలా వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ ఆ రోజుల్లో క్రేజీ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే సింహాద్రి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎలా అయితే హిట్స్ లేకుండా చాలా కాలం ఇబ్బంది పడ్డాడో అంకిత కూడా అలాగే ఇబ్బంది పడింది. 2004 వ సంవత్సరం లో విడుదలైన ‘అందరు దొంగలే’ అనే సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది.

ankitha

ఆ తర్వాత అదే ఏడాది నందమూరి బాలకృష్ణ తో కలిసి ఈమె చేసిన ‘విజయేంద్ర వర్మ’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇక అక్కడి నుండి ఈమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. కానీ 2009 వ సంవత్సరం వరకు అడపాదడపా అవకాశాలు అయితే వస్తూనే ఉండేవి. ఇక తర్వాత ఆమె బాగా లావు ఎక్కడం, డబుల్ చిన్ రావడం తో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

- Advertisement -
Ankintha

ఇక ఆమె వ్యక్తిగత విషయాలకు వస్తే 2016 వ సంవత్సరం లో ఈమె సిటీ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ విశాల్ జగ్తాప్ అనే అతనిని పెళ్ళాడి, న్యూ జెర్సీ లో స్థిరపడింది. గత ఆరేళ్ళ నుండి ఆమె అక్కడే ఉంటుంది. అయితే ఎన్నడూ కూడా ఈమధ్య కాలం లో మీడియా కి కనిపించని అంకిత కి సంబంధించి లేటెస్ట్ గా కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి ఆ ఫోటోలలో ఆమె లుక్ ని చూసి కుర్రకారులు మెంటలెక్కి పోతున్నారు.. ఈ వయస్సులో కూడా ఆమె లేటెస్ట్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోవట్లేదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు, మీరు ఆ ఫోటోలను చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here