ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే..

- Advertisement -

గత రెండు శుక్రవారాలు బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. ఈ వారం కూడా అదే రిపీట్ అవ్వబోతోంది. కాకపోతే ఈ వీక్ కాస్త పేరున్న నటులు ప్రేక్షకనులను అలరించబోతున్నారు. మరోవైపు ఈ వారం సందడి దాదాపు డబ్బింగ్ సినిమాలదే కనిపిస్తోంది. అలాగే ఈ వారం ఓటీటీలోనూ క్రేజీ వెబ్ సిరీస్​లు వస్తున్నాయి. మరి అవేంటో ఓ లుక్కేయండి.. మీ క్యాలెండర్​లో ఈ ఫ్రైడే షెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి.

 

థియేటర్​లో సందడి చేసే సినిమాలు ఇవే..

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

ఓటీటీలో వచ్చే సినిమాలు
ఓటీటీలో వచ్చే సినిమాలు

 

- Advertisement -

అల్లరి నరేశ్ మహర్షి సినిమా నుంచి కాస్త సీరియస్​నెస్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నాడు. తన రీసెంట్ సినిమా నాందిలో యాక్టింగ్ ఇరగదీసిన నరేశ్ ఈ వారం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో మన ముందుకొస్తున్నాడు. అన్యాయంగా బెదిరించేవాడికన్నా.. న్యాయం కోసం ఎదిరించేవాడే బలమైనవాడు అంటున్నాడు. ఎన్నికల విధుల కోసం గిరిజన ప్రాంతానికి వెళ్లిన ఆయన, ప్రజల కోసం ఏం చేశాడో తెలియాలంటే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చూడాల్సిందే. అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఏఆర్‌ మోహన్‌ దర్శకుడు. రాజేష్‌ దండా నిర్మాత. ఈ నెల 25న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా అల్లరి నరేష్‌ ఇందులో కనిపించనున్నారు.

తోడేలు

ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అతడు మళ్లీ సాధారణమైన మనిషిగా మారాడా? లేదా? అనే ఆసక్తికర అంశాలతో రూపుదిద్దుకున్న చిత్రం ‘భేడియా’. వరుణ్‌ ధావన్‌ – కృతిసనన్‌ జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ‘తోడేలు’ పేరుతో అల్లు అరవింద్‌ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అమర్‌ కౌశిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

 

లవ్ టుడే

తమిళంలో సూపర్ హిట్టయిన ‘లవ్‌టుడే’ అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ప్రదీప్ రంగనాథన్‌ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. నవంబరు 25న థియేటర్‌లలో ‘లవ్‌టుడే’ విడుదల కానుంది. ఇవానా కథానాయిక. యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించారు.

 

రణస్థలి

ధర్మ, చాందినిరావు జంటగా నటించిన చిత్రం ‘రణస్థలి’. ‘అశ్వద్థామ’ చిత్రానికి రచయితగా పనిచేసిన పరశురాం శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. అనుపమ సూరెడ్డి నిర్మాత. నవంబరు 26న ఈ చిత్రం థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిది. ఈ కథలో హింస అంశాన్ని స్పృశించిన తీరు ఆలోచన రేకెత్తిస్తుంది. దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఈ కథలో రణం ఎవరెవరి మధ్య, ఎందుకు సాగిందన్నది కీలకం’ అని చిత్ర బృందం చెబుతోంది.

 

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలివే!

నెట్‌ఫ్లిక్స్‌

వెన్స్‌డే (వెబ్‌సిరీస్‌) నవంబరు 23

ద స్విమ్మర్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 23

గ్లాస్‌ ఆనియన్‌ (హాలీవుడ్) నవంబరు 23

బ్లడ్‌, సెక్స్‌ అండ్‌ రాయల్టీ (డ్యాకుమెంటరీ సిరీస్‌) నవంబరు 23

ద నోయల్‌ డైరీ (హాలీవుడ్‌) నవంబరు 25

ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌ (హిందీ సిరీస్‌) నవంబరు 25

పడవేట్టు (మలయాళం) నవంబరు 25

 

అమెజాన్‌ ప్రైమ్‌

గుడ్‌ నైట్‌ ఊపీ (మూవీ) నవంబరు 23

 

జీ5

చుప్‌ (బాలీవుడ్‌) నవంబరు 25

 

డిస్నీ+హాట్‌స్టార్‌

ప్రిన్స్‌ (తెలుగు) నవంబరు 25

ద గార్డియన్‌ ఆఫ్‌ ది గెలాక్సీ హాలిడే స్పెషల్‌ (హాలీవుడ్‌) నవంబరు 25

ఆహా

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (తెలుగు మూవీ) నవంబరు 25

ఎన్‌బీకే అన్‌స్టాపబబుల్‌ (సీజన్‌-2 ఎపిసోడ్‌ 4) నవంబరు 25

 

సోనీ లివ్‌

గర్ల్స్‌ హాస్టల్‌ (హిందీ సిరీస్‌) నవంబరు 25

మీట్‌ క్యూట్‌ (తెలుగు మూవీ) నవంబరు 25

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here