Bigg Boss Nutan Naidu : స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో పాల్గొనే కంటెస్టెంట్స్ కెరీర్ పూర్తిగా మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పటి వరకు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ, సరైన పాత్రలు దొరకక కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకుంటున్న కొంతమంది సెలబ్రిటీస్, ఈ రియాలిటీ షోలో పాల్గొని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఇప్పటి వరకు 6 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ లో అన్ని సీజన్స్ కంటే కూడా రెండవ సీజన్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సీజన్ లో సెలెబ్రిటీలతో పాటుగా నూతన్ నాయుడు, గణేష్ మరియు సంజన వంటి కామన్ పీపుల్ కూడా కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు.వీరిలో మిగిలిన ఇద్దరు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ, నూతన్ నాయుడు మాత్రం బాగా పాపులర్ అయ్యాడు.బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొత్తల్లో మెతక మనిషిలాగ అనిపించిన నూతన్ నాయుడు సామ్రాట్ మరియు తనీష్ వంటి వారితో గొడవపడి బాగా పాపులర్ అయ్యాడు.

‘ఎవ్వరూ గాజులు తొడుక్కోలేదిక్కడ’ అనే డైలాగ్ తో నూతన్ నాయుడు ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.సోషల్ మీడియా లో ఇప్పటికీ ఆ డైలాగ్ మీద మెమేలు లో వస్తుంటాయి.అలా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నూతన్ నాయుడుకి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమా ‘F2’ లో ఒక చిన్న రోల్ ఇచ్చాడు.ఆ రోల్ చిన్నదే అయినా బాగా క్లిక్ అయ్యింది కానీ, నూతన్ నాయుడు కి మాత్రం సినిమా అవకాశాలను రప్పించలేకపోయింది.వాస్తవానికి నూతన్ నాయుడు బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ గానే అడుగుపెట్టాడు కానీ, 2009 ఎన్నికలలో చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ నుండి MLA గా పోటీ చేసాడు, ఆర్థికంగా ఆయన మొదటి నుండి మంచి బలం ఉన్నోడే.ప్రస్తుతం ఆయన తన వ్యాపారం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా నూతన్ నాయుడు కి వివాదాలు కూడా ఎక్కువే..గతం లో ఆయన భార్య ఒక దళిత యువకుడికి బలవంతంగా తన నివాసం లో బానిస లాగ ట్రీట్ చేస్తూ గుండు కొట్టించిన ఘటనకి సంబంధించి CC టీవీ కెమెరా లో వీడియో తో సహా అడ్డంగా దొరికిపోవడం, ఆయన భార్య తప్పించేందుకు నూతన్ నాయుడు ప్రవర్తించిన తీరుని గమనించి పోలీసులు ఆయనని అరెస్ట్ చెయ్యడం వంటివి ఆ రోజుల్లో సంచలనం రేపాయి.ఆ తర్వాత కొన్నాళ్ళకు బయటకి వచ్చిన నూతన్ నాయుడు ప్రస్తుతం జనసేన పార్టీ లో చోటు సంపాదించేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాడు.మరి పవన్ కళ్యాణ్ ఆయనని గుర్తిస్తాడో లేదో చూడాలి.
