Pawan Kalyan కొన్ని కాంబినేషన్స్ అంత తేలికగా సెట్ కావు,అన్ని కలిసి రావాలి..అలా కలిసి వచ్చినప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ అవుతాయి.ఇప్పుడు మల్టీస్టార్ర్ర్ సినిమాలు ఎక్కువయ్యాయి.ఆరోజుల్లో ఇలా ఉండేది కాదు, రీసెంట్ గా విడుదలైన ‘#RRR’ చిత్రం గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో, స్టార్ డైరెక్టర్స్ మల్టీస్టార్ర్ర్ సినిమాలను తియ్యడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఆ విధంగా అభిమానులకు డ్రీం ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి, అవి భవిష్యత్తులో కార్యరూపం దాల్చాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి పవన్ కళ్యాణ్ – రవితేజ.

ఎనర్జీ కి అనంతం లాగా ఉండే ఈ ఇద్దరు కలిస్తే కేవలం అభిమానులకు మాత్రమే కాదు, మూవీ లవర్స్ కి కూడా కనుల పండుగ లాగ ఉంటుంది. రవితేజ కూడా తనకి మల్టీస్టార్ర్ర్ సినిమా చెయ్యాలనిపిస్తే పవన్ కళ్యాణ్ తో చేస్తానని పలు సందర్భాలలో తెలిపాడు కూడా. ఆరోజు భవిష్యత్తులో వస్తుందో లేదో తెలియదు కానీ, గతం లో మాత్రం లో వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా మిస్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభం లో సూపర్ హిట్ సినిమాగా నిల్చిన ‘సుస్వాగతం’ లో రవితేజ కి పవన్ కళ్యాణ్ స్నేహితులతో ఒకరిగా నటించే అవకాశం వచ్చిందట. అప్పటికీ రవితేజ స్టార్ కాదు, హీరో గా కూడా ఆయన ఎంట్రీ ఇవ్వలేదు. ఇలా ముఖ్యమైన పాత్రలు చేసుకుంటూ ఉండేవాడు, కానీ సుస్వాగతం సినిమాలో ఆఫర్ వచ్చిన సమయానికి రవితేజ కి హీరో గా నటించే అవకాశం దక్కింది. శ్రీనువైట్ల దర్శకత్వం లో ‘నీకోసం’ అనే సినిమా షూటింగ్ చేస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా సమయం లోనే రవితేజ కి సుస్వాగతం ఆఫర్ వచ్చింది, కానీ డేట్స్ సర్దుబాటు చెయ్యలేక ఈ సినిమాని మిస్ చేసుకోవాల్సి వచ్చింది.

అన్ని కుదిరి ఉంటే వీళ్ళ కాంబినేషన్ లో అప్పుడే ఒక సినిమా చూసేవాళ్ళం, కానీ బ్యాడ్ లక్. రవితేజ స్టార్ హీరో అయ్యాక చేసిన ఏకైక మల్టీస్టార్ర్ర్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య‘. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. రాబొయ్యే రోజుల్లో పవన్ కళ్యాణ్ – రవితేజ కాంబినేషన్ లో కూడా సినిమా రావాలని కోరుకుందాం.