Veera Simha Reddy : ఓటీటీ లో ‘ వీర సింహా రెడ్డి ‘ అల్ టైం రికార్డు.. 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!

- Advertisement -

Veera Simha Reddy : ఈ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిల్చిన నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ చిత్రం నిన్న డిస్నీ + హాట్ స్టార్ లో విడుదలైంది. థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కంటే కూడా ఓటీటీ లో విడుదలైన తర్వాత వచ్చిన రెస్పాన్స్ అదిరిపోయిందని అంటున్నారు విశ్లేషకులు.సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఎక్కడ చూసిన ఈ సినిమాలోని సన్నివేశాల గురించే మాట్లాడుకుంటున్నారు.

Veera Simha Reddy
Veera Simha Reddy

బాలయ్య బాబు నటన, థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు గోపీచంద్ మలినేని అద్భుతమైన షాట్ మేకింగ్ గురించి విడుదలప్పుడు పెద్దగా మాట్లాడుకోలేదు కానీ, ఓటీటీ లో విడుదలైన తర్వాత మాత్రం బాగా మాట్లాడుకుంటున్నారు.దీనిని బట్టీ చూస్తుంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ ని చూసినవాళ్ళ కంటే ఓటీటీ విడుదల కోసం ఎక్కువగా ఎదురు చూసిన వాళ్ళే ఉన్నారని అర్థం అవుతుంది.అందుకే ఓటీటీ లో సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పింది ఈ చిత్రం.

Balakrishna Veera Simha Reddy movie

డిస్నీ + హాట్ స్టార్ లో అప్లోడ్ చేసిన నిమిషం వ్యవధిలోనే ఈ సినిమాని లక్ష 50 వేల మంది వీక్షించారని,ఇది ఆల్ టైం రికార్డు అని డిస్నీ + హాట్ స్టార్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.అలా అప్లోడ్ చేసిన 24 గంటలకు గాను ఈ సినిమాకి 3 మిలియన్ల యూనిక్ యూజర్స్ వ్యూస్ వచ్చాయట.ఇది కూడా ఒక రికార్డే అని అంటున్నారు.గతం లో బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘అఖండ’ చిత్రాన్ని కూడా డిస్నీ + హాట్ స్టార్ యాప్ లోనే అప్లోడ్ చేసారు.

- Advertisement -
Veera Simha Reddy movie in ott

ఈ సినిమాకి 24 గంటల్లో రెండు మిలియన్ల యూనిక్ యూజర్లు చూడగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకి 2.8 మిలియన్ యూనిక్ యూజర్స్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఆ రెండు సినిమాలను అధిగమించి ‘వీర సింహా రెడ్డి‘ మూడు మిలియన్ల యూనిక్ యూజర్స్ వ్యూస్ ని సంపాదించుకొని ఆల్ టైం నెంబర్ 1 తెలుగు సినిమాగా నిలిచిందని అంటున్నారు. ఈ రికార్డు ఎంతకాలం పదిలంగా ఉంటుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here