Shriya Saran : శ్రియా శరణ్.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా ఫేమస్. యమా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. దాదాపు ఎక్కువగా ఈ బ్యూటీ వెస్టర్న్ వేర్ లోనే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బికినీలోనూ సందడి చేస్తూ ఉంటుంది.
కానీ తాజాగా శ్రియా శరణ్ సూపర్ కూల్ లుక్ లో దర్శనమిచ్చింది. ట్రెడిషనల్ వేర్ లో శ్రియా లుక్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. పట్టుచీరలో.. జడలో మల్లెపూలు పెట్టుకుని.. ముక్కుపుడక పెట్టుకుని అచ్చతెలుగు అందమైన బాపూబొమ్మలా కనిపించింది.
తాజాగా శ్రియా తన న్యూ లుక్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పట్టుచీరలో ట్రెడిషనల్ లుక్ లో అచ్చం మహారాణిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రియా శరణ్ సూపర్ కూల్ గా కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పట్టుచీరలో శ్రియా అచ్చతెలుగు అమ్మాయిలా కనిపిస్తోందని కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ట్రెడిషనల్ లుక్ లోనూ శ్రియా తమ మనసు దోచేస్తోందంటూ కామెంట్స్ బాక్స్ నింపేస్తున్నారు. నాలుగు పదుల వయసులోనూ శ్రియా ఇరవై ఏళ్ల కుర్రదానిలా కనిపిస్తోందంటూ తెగ పొగిడేస్తున్నారు.
ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రియా. ఆ తర్వాత సంతోషం, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి సినిమాలతో అగ్రహీరోలందరితోనూ నటించింది. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి కుర్రహీరోలతోనూ శ్రియా రొమాన్స్ చేసింది. కొన్నేళ్లు తెలుగు వెండితరెపై ఓ వెలుగు వెలిగి ఒక్కసారిగా ఫేడవుట్ అయిపోయింది.
కొన్నేళ్ల తర్వాత శ్రియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ శ్రియ తన సత్తా చాటుతోంది. ఏకంగా ఆర్ఆర్ఆర్ వంటి సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ ను సంపాదించుకుంది. గమనం వంటి సినిమాలో కీలక పాత్రలో నటించి.. నటనలో తన విశ్వరూపాన్ని చూపించింది. మరోవైపు బాలీవుడ్ లోనూ శ్రియా తన సత్తా చాటుతోంది. తాజాగా దృశ్యం 2తో బీ టౌన్ ప్రేక్షకులను అలరించింది.