Rashmika Mandanna వేసుకున్న ఈ డ్రెస్ కాస్ట్ తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే..

- Advertisement -

Rashmika Mandanna గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మంచి దూకుడు మీద ఉంది. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉంది.. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉంటాం.. తాజాగా మరో ఫోటోను షేర్ అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది.. అందులోవైట్ టాప్‌లో ఉన్న ఆ డ్రెస్ ధర గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఆ డ్రెస్ కాస్ట్ దగ్గరదగ్గర రెండు లక్షల వరకు ఉంటుందని సమాచారం.. లూయిస్ విట్టన్ బ్రాండ్‌కు చెందినది. అయితే ఈ క్యాజువల్ స్టైల్ సిల్క్ నైలాన్ లాంగ్ స్లీవ్స్‌కు మరి అంత ధర ఎందుకో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక రష్మిక లేటెస్ట్‌గా వారసుడు అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. ఇకపోతే ఈ అమ్మడు వరుస భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ ఫాం లో ఉంది.. ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోయినలలో ఈమె ఒకటి.. తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేసిందని తెలుస్తోంది..

అందులో భాగంగా ఆమె ఈ ఐదు సంవత్సరాల్లో ఓ ఐదు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను కొన్నట్లు తెలుస్తోంది. ఇవి ఐదు డిఫరెంట్ ప్లేసుల్లో అని సమాచారం. రష్మిక హైదరాబాద్, గోవా, ముంబై, కూర్గ్, బెంగుళూరు సిటీలో ఖరీదైన అపార్ట్‌మెంట్స్ ఉన్నాయని మొన్నమధ్య వార్తలు వినిపించాయి.. అంతేకాదు సోషల్ మీడియా ఏరి కోరి వివాదాలను కూడా తెచ్చుకుంటూ వస్తుంది.. బ్యాక్ టు బ్యాక్ ఇలా బిగ్గీలతో ఇతర హీరోయిన్స్‌తో పోల్చితే అగ్రస్థానంలో ఉన్నారు. ముఖ్యంగా పుష్ప విజయం తర్వాత రష్మిక మందన్న హిందీలో అద్భుతమైన క్రేజ్‌ను తెచ్చుకున్నారు. ఒక్క హిందీలో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో పుష్ప 2, తమిళంలో వారిసు చిత్రాల్లో నటించింది.. పుష్ప 2 తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here