Allu Arjun – Sneha : పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ గురించి అందరికి తెలుసు.. తన భార్య అల్లు స్నేహ రెడ్డి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. రోజుకొ వార్త సంచలనంగా మారుతుంది.. నిజానికి వివాదాలకు దూరంగా ఉండే స్టార్ అల్లు అర్జున్. పెద్దగా బయట కూడా కనిపించరు. ఎవరితోనూ గొడవలు కూడా పెట్టుకోరు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది..
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. స్నేహా రెడ్డికి కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే.. స్నేహా రెడ్డి ఈ మధ్య కొంచెం గ్లామర్ డోస్ కూడా పెంచి సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తన ఫోటోలతో మత్తెక్కిస్తోంది. వాటిపై అల్లు అర్జున్ సీరియస్ అయ్యారట. సోషల్ మీడియాలో స్నేహారెడ్డి పెట్టే ఫోటోషూట్లపై నెగెటివ్ కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే.. దాంతో సీరియస్ అయిన బన్నీ భార్యను ఫోటో షూట్ చెయ్యొద్దని వారించారు..
నేనెందుకు ఫోటోషూట్స్ ఆపాలి. నేను అవి పట్టించుకోను అంటూ తెగేసి చెప్పేసిందట. కానీ.. అల్లు అర్జున్ మాత్రం తనపై వల్గర్ గా వచ్చే కామెంట్స్ చూసి బాధపడుతున్నాడని తెలుస్తోంది. కావాలని.. బన్నీ అంటే పడని యాంటీ మెగా ఫ్యాన్స్ ఈ జంట మధ్య చిచ్చు పెట్టాలని కావాలని స్నేహా రెడ్డి పోస్టులపై నెగెటివ్ కామెంట్స్ పెడుతూ ట్రోల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో బన్నీ, స్నేహారెడ్డి విడాకులు తీసుకునే వరకు వెళ్లారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే… దానికి బన్నీ కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదు.. టాలివుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ అయినా వీరిద్దరి గురించి ఎన్ని రూమర్స్ వస్తాయో చూడాలి..