Kutty Radhika : నందమూరి తారకరత్న ఇటీవలే కన్నుమూసిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.అయితే బ్రతికి ఉన్నన్ని రోజులు ఆయనని ఎవరూ పట్టించుకోలేదు కానీ, చనిపోయిన తర్వాత మాత్రం అతని లైఫ్ హిస్టరీ మీద రోజుకో వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది.ఈరోజు తారకరత్న పుట్టిన రోజు, ఈ ఏడాదితో 39 ఏళ్ళను పూర్తి చేసుకొని నలభై ఏట లోకి అడుగుపెట్టాడు.
కానీ దురదృష్టం ఏమిటంటే కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషం గా గడపాల్సిన ఈ దినం ఆయన ఎవ్వరికీ అందుబాటులో లేకుండా తిరిగిరాని లోకాలకు ప్రయాణం అయ్యాడు.ఈ సందర్భంగా తారకరత్న గురించి నేడు సోషల్ మీడియా లో ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన వార్త బయటపడింది.తారకరత్న మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ కి సంతకం చేసిన రోజే వరుసగా 9 సినిమాలకు కూడా సంతకం చేసాడు.
అయితే తారకరత్న తొలి సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాకపోవడం తో ఈ 9 సినిమాలలో కేవలం కొన్ని మాత్రమే విడుదలయ్యాయి. మరికొన్ని సినిమాలు పూజ కార్యక్రమాల దగ్గరే ఆగిపోయాయి. అయితే ఆయన కెరీర్ లో కాస్త కమర్షియల్ పరంగా మంచి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘భద్రాద్రి రాముడు’. ఇందులో సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ ముఖ్య పాత్ర పోషించగా, రాధికా అనే అమ్మాయి హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఈమె ఎవరో కాదు, బెంగళూరు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య. గతం లో ఈమె కన్నడలో అనేక సినిమాలు చేసింది.
‘భద్రాద్రి రాముడు’ సినిమా సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ఎదో నడుస్తుంది, డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్స్ వార్తలు వినిపించేవి. అప్పట్లో ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని అందరూ అనుకునేవారు, కానీ కాలం గడిచేకొద్దీ ఆ రూమర్స్ నిజమయ్యాయి. హీరోయిన్ గా కన్నడ లో అగ్ర తారగా వెలుగొందిన రాధికా, ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతుంది. రాబొయ్యే రోజుల్లో రాజకీయ అరంగేట్రం కూడా చెయ్యబోతుందట. ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు క్రింద అందిస్తున్నాము చూడండి.