Pavitra Naresh విడిపోయారా?? వార్నీ నిజమా?? అలా ఎలా మావా ..!!

- Advertisement -

Pavitra Naresh : మీడియా లో గత కొంతకాలం నుండి హాట్ టాపిక్ గా మారిన అంశం నరేష్-పవిత్ర ప్రేమ వ్యవహారం.ప్రపంచం ఏమనుకుంటే మాకెందుకు, మా ఇష్టమొచ్చినట్టు మేము బ్రతుకుతాము అనే ధోరణిలోనే నరేష్- పవిత్ర ముందుకు పోతున్నారు.నరేష్ కి ఇది నాల్గవ పెళ్లి, తొలుత వీళ్లిద్దరి మధ్య పెళ్లి అనే వార్త వినగానే వీళ్ళని అభిమానించే వాళ్ళు సైతం అసహ్యించుకున్నారు.కానీ కొంతమంది రూమర్స్ ఏమో అనుకున్నారు, కానీ అవి రూమర్స్ కాదు నిజమేనని ఈ కొత్తసంవత్సరం లో ఇద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ విడుదల చేసిన వీడియో కలకలం రేపింది.

Pavitra Naresh
Pavitra Naresh

ఈ వయస్సులో ఇవేమి పనులు అంటూ నెటిజెన్స్ చేత బూతులు తిట్టించుకుంది ఈ జంట.ఇవన్నీ పక్కన పెడితే నరేష్ మూడవ భార్య రమ్య నరేష్ కి విడాకులు ఇచ్చే సమస్యే లేదంటూ రచ్చ చెయ్యడం ప్రారంభించింది.నరేష్ ఆమెని ఎన్ని విధాలుగా వదిలించుకోవాలని చూసినా, ఆమెపై ఎన్ని ఆరోపణలు చేసిన, రమ్య అలుపెరగకుండా, వెనకడుగు వెయ్యకుండా పోరాడుతూనే ఉంది.

Pavitra Lokesh -naresh

ఆమెకి నరేష్ డబ్బులిచ్చి వదిలించుకుందాం అని కూడా చూసాడు, కానీ అవేమి వర్కౌట్ అవ్వలేదు.దీనితో నరేష్ మరో కొత్త నాటకానికి తెరలేపాడు.రమ్య ఆస్తుల కోసం తనపై హత్యా ప్రయత్నాలు చేయిస్తుందని,హైదరాబాద్ నుండి ఒక ముఠాని కూడా అందుకోసం దింపింది అంటూ మీడియా ముందుకొచ్చి కామెంట్స్ చేసాడు.ఇక రీసెంట్ గా తన ఇంటి పై రమ్య కి సంబంధించిన ఒక ముఠా రెక్కీ నిర్వహించిందని,పార్కింగ్ లో ఉన్న నా కారుని ద్వంసం చేసారని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు.

- Advertisement -
Pavitra Lokesh -naresh marriage

ఇవన్నీ గమనించిన నెటిజెన్స్ ఈ పాతకాలపు ఐడియాలను ఇంకా ఎందుకు వాడుతున్నారు, కొత్తగా ఆలోచించు నరేష్ అని కామెంట్స్ చేస్తున్నారు. రమ్య పట్టుదల చూస్తూ ఉంటే నరేష్ – పవిత్రల పెళ్లిని జరగనిచ్చేలా లేదు, నరేష్ ఇన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కూడా ఆమె వెనకడుగు వెయ్యకుండా తన హక్కుల కోసం పోరాడుతున్న తీరుని చూసి ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఆమె ఇదే పట్టుదలతో నరేష్ పెళ్లి పెటాకులు అయ్యినట్టే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

Pavitra Lokesh -naresh-ramya
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here