Taraka Ratna : వరల్డ్ రికార్డు సృష్టించిన తారకరత్న..9 సినిమాలతో ఇండస్ట్రీకి ఎంట్రీ..

- Advertisement -

Taraka Ratna : నందమూరి తారక రత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే..గత కొన్ని రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ చికిత్స అందుకున్న నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఈ వార్త కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా అభిమానులకు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేస్తుంది.ఇక అతనికి సంబంధించిన అనేక రకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నందమూరి తారకరత్న రికార్డు స్థాయిలో ఒక గిన్నిస్ బుక్ రికార్డును కూడా అందుకున్నాడు. ఒకేరోజు 9 సినిమాలతో లాంచ్ అయిన హీరోగా అతను అప్పట్లో నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా నిలిచాడు..

Taraka Ratna
Taraka Ratna

ఒకేసారి అన్ని సినిమాలతో అంటే మామూలు విషయం కాదు..నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక ఆయన తర్వాత మూడవ తరం వారసులు చాలామంది ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే అందులో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తర్వాత తారకరాత్న కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు..ఇక తారకరత్న గిన్నిస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే అతను ఎంట్రీ ఇచ్చినప్పుడు 2002లో ఒకేసారి 9 సినిమాలను లాంచ్ చేయడం విశేషం. అప్పట్లో అతనికి సంబంధించిన అనేక రకాల వార్తలను కూడా వచ్చాయి. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా మొదట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కగా కీరవాణి మ్యూజిక్ అందించారు..

Actor Taraka Ratna
Actor Taraka Ratna

ఆ తర్వాత యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు ఇలాంటి సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. అయితే మొదట తొమ్మిది సినిమాలను లాంచ్ చేయగా అందులో కేవలం ఈ సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలిన సినిమాలు కొన్ని ప్రారంభ దశలోనే ఆగిపోగా మరికొన్ని షూటింగ్ మొదలయ్యాక ఆగిపోయాయి..హీరోగా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా మంచి వ్యక్తిగా మాత్రం ఇండస్ట్రీలో అందరికీ గుర్తుండిపోయాడు. అతను ఎవరితో కూడా ఇప్పుడు తప్పుగా వ్యవహరించినట్లు లేదు. అందరిని సమానంగా చూసేవాడు అని సన్నిహితులు చెబుతూ ఉంటారు.విలన్ గా అమరావతి అనే సినిమాలో నటించి నంది అవార్డును అందుకున్నాడు.. అలాంటి తారకరత్న మనమధ్య లేదు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.. ఆయన మృతి పట్ల పలువురు, సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్దిస్తున్నారు.. సోమవారం ఆయన అంత్యక్రియలు మహా ప్రస్థానం లో జరగనున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here