Nijam With Smita : క్రీడలు కాకుండా ఇంతకు ముందు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలే మరియు సీరియల్స్ మాత్రమే. అయితే కాలక్రమేణా మాధ్యమాలు పెరిగిపోతూ రావడం తో ఆడియన్స్ అభిరుచులు కూడా మారిపోయాయి.ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత అయితే మరీనూ!.బాలీవుడ్ లో కొన్ని టాక్ షోస్ ప్రభంజనం సృష్టించడం తో, అక్కడి ట్రెండ్ ని మనవాళ్ళు కూడా ఫాలో అవుతూ ఓటీటీ లో టాక్ షోస్ ని నిర్వహిస్తున్నారు.

ముఖ్యంగా ఆహా యాప్ లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ సీజన్ ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఇప్పటి వరకు రెండు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ టాక్ షో రెండూ కూడా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి.అంతే కాదు ఆహా మీడియా యాప్ ని ఇండియా లో టాప్ 10 లిస్ట్ లో ఒకటిగా నిలిపింది ఈ బిగ్గెస్ట్ టాక్ షో.

అయితే ఈ టాక్ షో కి పోటీనే లేదని ఇన్ని రోజులు మనం అనుకున్నాము..కానీ ప్రముఖ పాప్ సింగర్ స్మిత సోనీ లివ్ యాప్ లో ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ద్వారా ‘అన్ స్టాపబుల్’ షో కి పోటీని ఇవ్వడమే కాదు, ఏకంగా దాటివేసింది కూడా.రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి ఈ టాక్ షో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కాసేపు స్మిత తో ముచ్చట్లు ఆడిన సంగతి తెలిసిందే.ఇప్పుడు రెండవ ఎపిసోడ్ కి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నాడు.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే లాంచ్ అయ్యింది.ఇది ఇలా ఉండగా మొన్న ప్రసారమైన చిరంజీవి ఎపిసోడ్ కి వచ్చిన వ్యూస్ , ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ సీజన్ 1 లో ప్రసారమైన నాలుగు ఎపిసోడ్స్ కి వచ్చిన వ్యూస్ కంటే ఎక్కువట. ఆసక్తికరమైన ప్రశ్నలు అడగడం వల్లే ఆ స్థాయి వ్యూస్ వచ్చాయని తెలుస్తోంది. ఇక రాబొయ్యే రోజుల్లో ఈ టాక్ షోకి ఎంతోమంది సెలబ్రిటీస్ రాబోతున్నారు, అవన్నీ కలిపితే చాలా తేలికగా ‘అన్ స్టాపబుల్‘ టాక్ షో ని బీట్ చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
