Jagapathi Babu ఒకప్పుడు కుటుంబ కథ చిత్రాలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో జగపతి బాబు.హీరో గా ఆయన ఎంత సక్సెస్ సాధించాడో, సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా అంతే సక్సెస్ ని సాధించాడు.
బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘లెజెండ్’ చిత్రం తో తొలిసారిగా విలన్ గా మారిన జగపతి బాబు, ఆ చిత్రం తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతీ ఒక్కరికి జగపతి బాబు మాత్రమే విలన్ గా కావాలి, ఆ రేంజ్ లో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.అయితే జగపతి బాబు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
మనసులో ఉన్న మాటని ఎలాంటి బెరుకు లేకుండా నిజాయితీగా గా బయటపెట్టే అతి తక్కువమంది లో ఒకరు జగపతి బాబు,మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా ఆయన అలాగే మాట్లాడాడు.
మన రాష్ట్రము లో చస్తే సిస్టం గురించి ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య నే ఒక ప్రముఖ కాలేజీ లో ఈవెంట్ జరిగినప్పుడు ముఖ్య అతిథిగా నన్ను పిలిస్తే అక్కడకి వెళ్ళాను, అక్కడికి వెళ్లిన తర్వాత నేను ఆ కాలేజీ ప్రిన్సిపాల్ తో కులాలని వ్యతిరేకిస్తూ మాట్లాడుతానని చెప్పాను.
అప్పుడాయన ఇక్కడ కుర్రాళ్ళకి కమ్మ పిచ్చి విపరీతంగా ఉంటుంది సార్, క్లోజ్ ఆడిటోరియం లో మీరొక్కరే ఉన్నారు, వాళ్ళు వేలల్లో ఉన్నారు. మీరు కులం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు జాగ్రత్త అని చెప్పాడు’ అంటూ జగపతి బాబు కామెంట్స్ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.