Titanic : ఇటీవల కాలం లో నిర్మాతలు మరియు బయ్యర్స్ పట్టుకున్న మంత్రం రీ రిలీజ్.ఈ ప్రయోగం ఈమధ్య సక్సెస్ అవ్వడం తో ఇప్పుడు ప్రతీ ఒక్కరు గతం లో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన సినిమాలను లేటెస్ట్ టెక్నాలజీ కి అనుగుణంగా మార్చి రీ రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు.తెలుగు లో ఈ ట్రెండ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు కెరీర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ని మరోసారి రీ రిలీజ్ చెయ్యగా వాటికి కాసుల కనకవర్షం కురిసింది.మన టాలీవుడ్ వీళ్లిద్దరి పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ ఎలా సక్సెస్ అయ్యిందో, హాలీవుడ్ లో జేమ్స్ కెమరూన్ సినిమాలు అలాంటి ట్రెండ్ ని సృష్టించాయి.గత ఏడాది అవతార్ పార్ట్ 1 ని రీ రిలీజ్ చేసారు, రెస్పాన్స్ అదిరిపోయింది.
ఇప్పుడు ‘అవతార్ 2 ‘ రన్నింగ్ లో ఉన్న సమయం లోనే జేమ్స్ కెమరూన్ తన కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన గొప్ప ప్రేమ కావ్యం ‘టైటానిక్’ ని రీ రిలీజ్ చేసారు.ఫిబ్రవరి 10 వ తారీఖున విడుదలైన ఈ సినిమా కి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ దక్కాయి.కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 22 మిలియన్ డాలర్లను వసూలు చేసినట్టు సమాచారం.
ఇది ఇప్పటి వరకు రీ రిలీజ్ అయినా సినిమాలకంటే అత్యధిక వసూళ్లు సాధించినట్టు అన్నమాట.మరో విశేషం ఏమిటంటే అవతార్ 2 ప్రస్తుతం థియేటర్స్ లో రన్నింగ్ లో ఉంది, గత వీకెండ్ లో ఆ చిత్రానికి వచ్చిన వసూళ్లకంటే ‘టైటానిక్‘ కి ఎక్కువ వసూళ్లు వచ్చినట్టు హాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.మరి లాంగ్ రన్ లో టైటానిక్ ఎంత మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.