Mrunal Thakur .. పరిచయం అక్కర్లేని పేరు.. సీతారామం సినిమాతో ఈ బాలీవుడ్ బ్యూటీ అనూహ్యమైన క్రేజ్ ను సంపాదించుకుంది. పెద్దగా గ్లామర్ షో చేయకుండానే ఈ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం కొందరికే సాధ్యం. ఈ యంగ్ బ్యూటీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా మృణాల్ ఠాకూర్ పై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది అలాంటి పరిస్థితే ఎదురైంది. ఇటీవల మృణాల్ ఓ ఇంటర్వ్యూలో తన భర్త విషయంలో కామెంట్స్ చేసింది. నేను బాయ్ ఫ్రెండ్ ని కానీ భర్తని కానీ అందం చూసి ఎంపిక చేసుకోను అని తెలిపింది. ఆ తర్వాత కపిల్ శర్మ షోలో కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తనకు ప్రియుడు కానీ కాబోయే భర్త కానీ అందంగా ఉండాలి అని స్టేట్మెంట్ ఇచ్చింది.
ఓకే ప్రశ్నకి రెండు రకాలుగా
కామెంట్స్ చేయడంతో నెటిజన్లు మృణాల్ ఠాకూర్ పై మీమ్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఒక మీమ్ లో ఆమె కామెంట్స్ పోస్ట్ చేస్తూ.. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో కపటత్వానికి అర్థం మార్చారు. కపటత్వం అంటే మృణాల్ ఠాకూర్ అంటూ దారుణమైన కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
ఈ ట్రోలింగ్ కి మృణాల్ ఠాకూర్ బాగా హర్ట్ అయింది. తనని ట్రోల్ చేస్తూ క్రియేట్ చేసిన మీమ్ కి రిప్లై ఇస్తూ.. నేను అప్పుడు ఎలా బాధ పడ్డాను.. ఇప్పుడు ఎలా బాధపడ్డాను అవుతున్నాను అని అభిప్రాయం చెప్పాను. మేము కూడా మనుషులమే అని ఇలాంటి వాళ్ళు అవి మరచిపోతున్నారు.. అని మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ ట్విట్టర్ లో రిప్లై ఇచ్చింది. ఈ ట్రోలింగ్ విషయంలో కొందరు అభిమానులు ఆమెకి సపోర్ట్ చేస్తున్న ఇస్తున్నారు. ఇలాంటి వారికి స్పందించకండి.. మీరు గ్రేట్ హ్యుమన్ బీయింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్ పై ఈ కామెంట్స్ వైరల్ అవుతుంటే ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు.
Don't give reply u are amazing person
— k (@sa44384447) February 11, 2023
I think people sometimes forget artists are also humans!
— Mrunal Thakur (@mrunal0801) February 11, 2023