Bigg Boss 8 లోకి అడుగుపెట్టబోతున్న 7 పాత కంటెస్టెంట్లు..వాళ్లెవరో చూస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

Bigg Boss 8 ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో మన అందరికీ తెలిసిందే. గత సీజన్ ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ సీజన్స్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ నేపథ్యం లో సెప్టెంబర్ లో ప్రారంభం అవ్వబోయే సీజన్ 8 ఇంకా గొప్పగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. గత సీజన్ లో ఉల్టా పల్టా అనే కాన్సెప్ట్ తో బాగా ప్రమోట్ చేసారు, ఇది జనాల్లోకి బాగా వెళ్ళింది. ఈ సీజన్ లో ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నారు. ఇన్ఫినిటీ అంటే అనంతం, టాస్కులు కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఇలా ఏది తీసుకున్నా అనంతం గానే ఉంటుందని అర్థం వచ్చేలా ఒక ప్రోమో ని కట్ చేయబోతున్నారట.

Bigg Boss 8
Bigg Boss 8

వచ్చే నెలలో ఈ ప్రోమో విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉండగా ఈ సీజన్ మునుపెన్నడూ లేని విధంగా గత సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ని మరోసారి తీసుకొని రాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. సీజన్ 1 నుండి సీజన్ 7 వరకు ఒక్కో కంటెస్టెంట్ ని తీసుకొని రాబోతున్నారట. మొదటి సీజన్ నుండి నవదీప్ లేదా ధనరాజ్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అలాగే రెండవ సీజన్ నుండి యాంకర్ శ్యామల, మూడవ సీజన్ నుండి బాబా భాస్కర్, సీజన్ 4 నుండి అవినాష్, సీజన్ 5 నుండి నటరాజ్ మాస్టర్, సీజన్ నుండి శ్రీ సత్య, సీజన్ 7 నుండి శోభా శెట్టి ని తీసుకొనే యోచనలో ఉన్నారట.

Bigg Boss - Disney+ Hotstar

- Advertisement -

ఇప్పటి వరకు ఎన్నడూ కూడా ఇలా పాత కంటెస్టెంట్స్ ని టెలివిజన్ వెర్షన్ లో తీసుకొని రాలేదు. కానీ ఓటీటీ వెర్షన్ లో మాత్రం తీసుకొచ్చారు. ప్రస్తుతానికి అయితే ఈ ప్లాన్ తో ఉన్న బిగ్ బాస్ టీం చర్చలు కూడా జరుపుతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది. ఇకపోతే ఈ షో కి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. నాగార్జున కి బదులుగా బాలయ్య బాబు వ్యాఖ్యాతగా ఉంటారని ఒక టాక్ నడిచింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తర్వాత తేలింది.

Bigg Boss Telugu 8 Contestants List Leaked

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here