#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ దక్కించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అయితే విరామం లేకుండా జరుగుతుంది కానీ, ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఒక్క చిన్న గ్లిమ్స్ వీడియో కూడా రాకపోవడం అనేది అభిమానులకు చాలా బాధని కలగచేస్తున్న విషయం.

సోషల్ మీడియా లో నిర్మాత దిల్ రాజు ని ట్యాగ్ చేసి ఫ్యాన్స్ ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు కానీ, ఆయన సైడ్ నుండి ఈ సినిమా గురించి ఒక్క చిన్న అప్డేట్ కూడా లేదు. సంక్రాంతికి విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉండేవాడు అప్పట్లో దిల్ రాజు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సమ్మర్ కి కూడా ఈ సినిమా వచ్చేలాగా లేదు.

ఇకపోతే ఈ చిత్రం లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. మగధీర మరియు నాయక్ సినిమాల తర్వాత ఆయన ద్విపాత్రాభినయం పోషిస్తున్నది ఈ సినిమాలోనే. ఇప్పటికే ఆ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల అయ్యాయి. అయితే ఈ చిత్రం నుండి వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, ఇందులో రామ్ చరణ్ ఏకంగా 7 విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.
శంకర్ తన హీరోలను ప్రతీ సినిమాలో ఇలాగే చూపిస్తాడు. అయితే ఆ గెటప్స్ ఎక్కువగా పాటల్లోనే ఉంటాయి. ఈ చిత్రం లో పాటలను చిత్రీకరించడానికి దాదాపుగా 90 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యింది, ఈ గెటప్స్ కూడా అందులోనే ఉంది ఉంటుందేమో అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. ఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్ , సునీల్ , అంజలి ,ఎస్ జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
