OG Movie : ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలను రేకెత్తించిన చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముంచుకొస్తుండడం తో రాజకీయంగా బిజీ అవ్వడం వల్ల కొద్దిరోజులు ఈ సినిమాకి బ్రేక్ పడింది.

ఎన్నికలు పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. మే నెలలో ఆయన ఈ సినిమా కోసం సంపూర్ణంగా డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఇకపోతే నేడు ఈ చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు ఒక పోస్టర్ తో అధికారిక ప్రకటన చేసారు. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.

ఎందుకంటే ఈ ‘అత్తారింటికి దారేది’ చిత్రం కూడా సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదలై సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అయితే ఓజీ విడుదల తేదీ ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులను కాస్త కంగారు పెడుతుంది. ఎందుకంటే అప్పట్లో ‘అత్తారింటికి దారేది’ విడుదలకు ముందు రామ్ చరణ్ ‘తుఫాన్’ చిత్రం విడుదల అవ్వగా, ‘అత్తరెంటికి దారేది’ విడుదల తర్వాత ఎన్టీఆర్ ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రం విడుదలైంది.

ఈ రెండు సినిమాల ఫలితాలు మన అందరికీ. ఎన్టీఆర్, రామ్ చరణ్ కెరీర్స్ లో భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇప్పుడు కూడా వీళ్లిద్దరి సినిమాలు దేవర, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కి ముందు, ఆ తర్వాత అన్నట్టుగా విడుదల అవ్వబోతున్నాయి. మరి అప్పట్లో రిపీట్ అయినా హిస్టరీ మళ్ళీ రిపీట్ కాబోతుందా?, లేదా రివర్స్ అవుతుందా? ఒకవేళ అదే సెంటిమెంట్ రిపీట్ అయితే మాత్రం గేమ్ చేంజర్, దేవర చిత్రాలకు కలిపి 600 కోట్ల రూపాయిల నష్టం వస్తుంది.