పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తారీఖున ఆయన హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘#OG’ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే చూడాలని అనుకున్నామో డైరెక్టర్ సుజిత్ అలాగే చూపించాడని, పవర్ స్టార్ ని ఇంత స్టైలిష్ మాస్ యాంగిల్ లో ఇప్పటి వరకు ఎవరూ చూపించలేదని, టీజర్ లోని ప్రతీ ఫ్రేమ్ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించేలా ఉందని సోషల్ మీడియా లో అభిమానులు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో పంజా తర్వాత ది బెస్ట్ టీజర్ అనిపించుకోగా, ఈ టీజర్ కి ఇప్పటి వరకు 23 మిలియన్ కి పైగా వ్యూస్, మరియు 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

ఇకపోతే ఈ టీజర్ విడుదల రోజు నుండి నేటి వరకు, అనగా 95 గంటల వరకు నాన్ స్టాప్ గా టాప్ 1 స్థానం లో ట్రెండ్ అవుతూ వచ్చింది. ఇది టాలీవుడ్ లోనే ఆల్ టైం రికార్డు గా చెప్తున్నారు ఫ్యాన్స్. ఇన్ని రోజులు నెంబర్ 1 స్థానం లో కొనసాగిన టీజర్ లేదని, ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ తర్వాత ‘#OG’ టీజర్ ఎక్కువ రోజులు ట్రెండ్ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇది ఇలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఈ టీజర్ మీద 4 వేలకు పైగా స్పూఫ్ వీడియోస్ వచ్చాయట. ఇది కూడా ఒక రికార్డు అని అంటున్నారు ఫ్యాన్స్. గతం లో ‘భీమ్లా నాయక్’ సినిమా పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు ని #OG టీజర్ చాలా తేలికగా బ్రేక్ చేసేసింది. ఇక రాబొయ్యే రోజుల్లో ఈ టీజర్ ఇంకెన్ని రికార్డ్స్ ని నెలకొల్పుతుందో చూడాలి.
