Sankranthi Movies : ప్రతి ఏడాది సంక్రాంతికి సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది..ఎప్పటి లాగానే వచ్చే ఏడాది కూడా భారీ బడ్జెట్ సినిమాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఏ హీరో సినిమా భారీ హిట్ ను అందుకుంటుందనే విషయం పక్కన పెడితే, ఈ సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టారు అనే విషయం హాట్ టాపిక్ అవుతుంది. ఈ సంక్రాంతికి చిన్న సినిమాలతో పాటు.. పెద్ద సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. ఒక నెల తర్వాత సంక్రాంతి బరిలో పందెం కోళ్లతో పాటు, సినిమాల సందడి కూడా ఉండబోతుంది. టాలివుడ్ లో అగ్ర హీరో లైన మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య తో పాటు తమిళ హీరో విజయ్ కూడా పోటీ పడుతున్నారు..
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా తర్వాత నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది.మరొకవైపు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా కూడా జనవరి 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే తమిళ హీరో దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా కూడా జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. వీటితో పాటు తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తునివు కూడా డబ్బింగ్ అయి తెలుగులో విడుదలకు రెడీ అవుతుంది.వీటితో పాటు మరో మూడు చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి..పండుగకు విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాల బడ్జెట్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సంక్రాంతికి విడుదల అవుతున్న పెద్ద సినిమాలలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా విజయ్ వారసుడు..నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏకంగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఒక్క హీరోకు ఇస్తుండటం గమనార్హం.. ఆ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య సినిమా. ఈ సినిమాను రూ.140 కు పైగా బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
అదే విధంగా..బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాను రూ.110 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ వారు రూపొందిస్తున్నారు.. అజిత్ నటించిన తునివు సినిమా రూ.100 కోట్లకు పైగానే బడ్జెట్ తో రూపొందుతుందని సమాచారం.. ఈ భారీ బడ్జెట్ సినిమాలలో ఏ సినిమా హిట్ అవుతుందో, కలెక్షన్స్ తో దూసుకుపోతుందో తెలియాలంటే సంక్రాంతి వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.. 2023 సంక్రాంతికి 600 కోట్లకు బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలు రేసులో ఉన్నాయి.. వీటితో పాటు చిన్న బడ్జెట్ సినిమాలు ఉన్నాయి..మరి ఏ సినిమా లక్ ఎలా వుంటుందో తెలియాలి..ఇప్పటివరకూ ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు సైతం భారీ హిట్ ను అందుకున్నాయి.. చూడాలి మరి ఏ సినిమా అదృష్టం ఎలా ఉందో..