2018 మూవీ ఫుల్ రివ్యూ.. ఇంతలా ఏడిపించిన సినిమా ఈమధ్యకాలం లో రాలేదు!

- Advertisement -

ఈ మధ్య యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. భాషతో సంబంధమే లేకుండా ప్రతీ ఒక్కరు ఓటీటీ లలో ఎగబడి మరీ ఇలాంటి సినిమాలను చూస్తున్నారు. ఇక తమ ప్రాంతానికి చెందిన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ తెరకెక్కించిన సినిమాలకు కూడా అద్భుతమైన ఆదరణ దక్కుతుంది.’కాంతారా’ మరియు ‘బలగం’ చిత్రాలు ఇందుకు ఉదాహరణ. అలా కేరళ లో 2018 వ సంవత్సరం లో వచ్చిన అతి భయంకరమైన వరదలు వచ్చినప్పుడు, ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవించారు, ఎలాంటి ఇబ్బందులను ఎదురుకున్నారు అనే దానిని ప్రధాన అంశంగా తీసుకొని ,ఫిక్షనల్ గా ఒక నాలుగు పాత్రలను తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘2018’. ఈ సినిమా కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 150 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ సినిమా, రేపు తెలుగు లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ అందరి కంటే ముందే మేము మీకు ఇవ్వబోతున్నాము.

2018 మూవీ ఫుల్ రివ్యూ
2018 మూవీ ఫుల్ రివ్యూ

కథ :

కేరళ రాష్ట్రము లోని అరవికుళ్ళం అనే గ్రామానికి చెందిన అనూప్ (తొనివో థామస్) ఎంతో ఉత్సహంతో ఆర్మీ లో చేరుతాడు.కానీ అక్కడ ఉండే కఠినతరమైన శిక్షణని తట్టుకోలేక, తన గ్రామానికి తిరిగి వచ్చేస్తాడు. పిరికివాడిలాగా తిరిగి వచ్చినందుకు గ్రామం లో ఉన్న ప్రతీ ఒక్కరు అనూప్ ని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ అలాంటివి ఏమి పట్టించుకోకుండా ఆయన దుబాయి కి వెళ్లి డబ్బులు బాగా సంపాదించాలనే లక్ష్యం తో వీసా కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆయన స్కూల్ టీచర్ మంజు ‘తన్వీ రామ్’ ప్రేమలో పడుతాడు. అలా అనూప్ స్టోరీ నడుస్తూ ఉంటుంది, ఇక ఆ తర్వాత నిక్సన్(అసిఫ్ అలీ) అనే కుర్రాడి కథ కూడా సమాంతరంగా నడుస్తూ ఉంటుంది. నిక్సన్ కి మోడల్ అవ్వాలని కల, అతని తండ్రి మరియు అన్నయ్య సముద్రం లో చేపలు పట్టుకునే ఒక నిరుపేద కుటుంబం, కానీ నిక్సన్ ఆలోచనలు అన్నీ కోటీశ్వరుల స్థాయిలోనే ఉంటుంది. అలా అతని కథ సాగుతుండగా కోసీ( రాజు వర్గీస్) స్టోరీ మొదలవుతుంది. ఇతను ఒక సాధారణ టాక్సీ డ్రైవర్. కేరళకు వచ్చిన పర్యాటకులకు, అక్కడి సుందరవంతమైన ప్రాంతాలను చూపిస్తూ ఉంటాడు. మరో పక్క లారీ డ్రైవర్ సేతుపతి , బాంబులను సరఫరా చేస్తుంటాడు. ఇలా ఈ నలుగురి కథలను ఆధారంగా తీసుకొని 2018 వ సంవత్సరం లో వరదలు వచ్చినప్పుడు వీళ్ళ జీవితాలు ఎలా తారుమారు అయ్యాయి అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

- Advertisement -

విశ్లేషణ :

ఈ చిత్రం స్క్రీన్ ప్లే మొత్తం , మన టాలీవుడ్ లో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ‘వేదం’ సినిమాతో పోలి ఉంటుంది. 2018 వ సంవత్సరం లో ఏర్పడిన వరదలను ఆధారంగా తీసుకొని,నాలుగు ఫిక్షనల్ క్యారెక్టర్స్ తో డైరెక్టర్ జూడ్ అంథోని జోసెఫ్ తెరకెక్కించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. ఆ సమయం లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఒకరికొక్కరు సహాయపడి ఎలా ఈ వరదల నుండి తప్పించుకున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు మన హృదయానికి హత్తుకుంటాయి. ఈ చిత్రానికి కేవలం మలయాళం ఆడియన్స్ మాత్రమే కాదు, తెలుగు , హిందీ , కన్నడ మరియు తమిళ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. రేపు తెలుగు లో వచ్చిన రెస్పాన్స్ ని బట్టీ ఈ చిత్రాన్ని ఇతర బాషలలో కూడా విడుదల చేస్తారట. ఒకవేళ అన్నీ బాషలలో క్లిక్ అయితే మాత్రం మరో ‘కాంతారా’ రిపీట్ అయ్యినట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలు మనం థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా వికలాండుగుడైన తమ కొడుకుని ఈ వరదల నుండి కాపాడుకునేందుకు తల్లితండ్రులు పడే పాట్లు మన గుండెల్ని పిండేస్తుంది , అలాగే ధ్రువ పాత్రల కోసం నిక్సన్ ఆ వరదలో కూడా ఇంటికి వెళ్లే క్రమం లో ఆయనకీ ఎదురైనా పరిణామాలు మనకి గూస్ బంప్స్ రప్పిస్తాయి. ఒక గర్భవతిని హెలికాప్టర్ ని ఎక్కించేందుకు చేసే ప్రయత్నం కూడా మన అందరికీ బాగా కనెక్ట్ అవుతాది.ఇలా ఒక్కటా రెండా, ఇలాంటి సన్నివేశాలెన్నో ఈ సినిమాలో మనం చూడవచ్చు. ఒక సరికొత్త అనుభూతితోనే థియేటర్స్ నుండి బయటకి వస్తాము.

నటినటులు: టొవినో థామస్, అసిఫ్ అలీ, లాల్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి, కున్ చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలై యారసన్, తదితరులు.
నిర్మాతలు: వేణ కున్న పిల్లై, సీకే పద్మ కుమార్, ఆటో జోసెఫ్.
తెలుగులో విడుదల: “బన్ని” వాసు
దర్శకత్వం: జూడ్ ఆంథోని జోసెఫ్.
సంగీతం: నోబిన్ పాల్
విడుదల: మే 26, 2023

చివరి మాట :

ప్రతీ ఒక్కరు థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఇది, చాలా సన్నివేశాలకు మనకి తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు తిరిగేస్తాయి.

రేటింగ్ : 3.5 /5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com