Summer Movies : ప్రతి ఏడాది సంక్రాంతి వచ్చింది అంటే కోడి పందాలు, కొత్త అల్లుడులు, బంధువుల తో సంబరాలతో పాటు సినిమాల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఈ ఏడాది కూడా సంక్రాంతిని మించి సమ్మర్ లో స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి..సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ రెడీ అయ్యారు. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది..బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చిత్రంకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో కూడా శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే తమిళ్ లైనా అజిత్ తనీవు, దళపతి విజయ్ వారీసు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు..ఈ సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి..ఇక సమ్మర్ లో కూడా చాలా సినిమాలు విదుదలకు సిద్ధంగా ఉన్నాయి.మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కు వరుస బ్రేక్స్ రావడంతో సినిమా మరింత వెనక్కి వెళ్ళే అవకాశాలు వున్నాయి. సమ్మర్ లో ఎలాగైనా సినిమాను విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
ఇకపోతే డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ ఏప్రిల్ 28న రాబోతుంది. కాగా, మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ కూడా సమ్మర్ లో రిలీజ్ కానుంది.. అదే విధంగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో చేస్తోన్న జైలర్ కూడా సమ్మర్ లోనే రానుంది. ఇక రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర , సాయి ధరమ్ తేజ్ హీరోగా చేస్తోన్న విరూపాక్ష సినిమా లు కూడా సమ్మర్ లో రిలీజ్ కానున్నాయి..ఇవే కాదు ఇంకా చాలా సినిమాలు సమ్మర్ ను టార్గెట్ చేశాయి.. అంటే వేసవిలో సినిమాల చల్లదనం కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పాలి…మొత్తానికి 2023 లో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది..ఏ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి మరి ..