ఆ సంఘటన తర్వాత నాగ బాబు నిహారిక ని ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదా..? చిరంజీవి చెప్పినా కూడా లెక్కచెయ్యలేదా!

- Advertisement -

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ కి ఒక చరిత్ర ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగి తన కుటుంబం లో ఉన్న వాళ్లకి కూడా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి తమ టాలెంట్ ని చూపించే అదృష్టాన్ని ప్రసాదించాడు. అలా చిరంజీవి అడుగుజాడల్లో వచ్చిన ఈ కుటుంబ సభ్యులు ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని శాసిస్తున్నారు.

నిన్నగాక మొన్న వచ్చిన వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ వంటి హీరోలు కూడా సక్సెస్ అయ్యారు. అయితే ఈ కుటుంబం నుండి వచ్చినప్పటికీ కూడా టాలెంట్ లేకపోవడం తో సక్సెస్ కాలేకపోయినా వాళ్ళు ఉన్నారు. వారిలో ఒకరే నిహారిక కొణిదెల, మెగా బ్రదర్ నాగ బాబు కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెల, పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు ని సంపాదించలేకపోయింది.

ఆ తర్వాత నిర్మాతగా పలు సినిమాలను నిర్మించింది కానీ, అవి కేవలం ఓటీటీ కి మాత్రమే పరిమితం అయ్యాయి. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె తన భర్త చైతన్య తో గత కొంతకాలం నుండి దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు విడాకుల కోసం కోర్టులో అప్లై చేసారు కూడా. వీళ్ళిద్దరినీ కలపడానికి నాగబాబు విశ్వప్రయత్నాలే చేసాడు. చైతన్య సర్దుకుపోయి కలవడానికి సిద్దంగానే ఉన్నప్పటికీ నిహారిక మాత్రం విడాకులు కావాలనే మొండికేసింది అట.

- Advertisement -

వాస్తవానికి చైతన్య మొదటి నుండి నిహారికకి చాలా సపోర్టివ్ గా ఉంటూ వచ్చాడు. అనేక విషయాల్లో ఆమెకి అండగా నిలిచాడు, ముఖ్యంగా నిహారిక హైదరాబాద్ లో ఒక పబ్ లో దొరికిపోయి పెద్ద గొడవలు అయినా సంగతి తెలిసిందే. ఈ విషయం లో నిహారిక తప్పు ఏమి లేదని తేలినా ఆమె పై ఒక మచ్చ అంటుకుంది. అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి. కానీ చైతన్య అన్నిటికీ సర్దుకుపోతూ సంసారం ని లాక్కొచ్చాడు, కానీ నిహారిక హద్దులు దాటి ప్రవర్తించడం తో ఇక చేసేది ఏమి లేక విడాకుల వరకు వెళ్ళాడు.

ఎప్పుడైతే నిహారిక విడాకులు కావాలి అంటూ రచ్చ చేసిందో, అప్పటి నుండి నాగబాబు ఆమెని దూరం పెట్టేసాడట. ఇప్పటి వరకు ఆమెని ఇంట్లో అడుగుకూడా పెట్టనివ్వలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ IPL టీం కొంటున్నాడు అంట కదా అని నిహారిక ని అడగగా, అవునా ఏమో నాకు తెలియదు మాట్లాడి చాలా రోజులైంది అని చెప్తుంది. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నాగబాబు తో పాటుగా మెగా కుటుంబం మొత్తం నిహారిక ని దూరం పెట్టేసింది అంటున్నారు. ప్రస్తుతం నిహారిక మణికొండ లోని ఒక అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ తీసుకొని ఒంటరిగానే ఉంటుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here