‘భోళా శంకర్’ కి సున్నా షేర్స్.. మెగాస్టార్ చిరంజీవి కి ఇది డేంజర్ బెల్స్!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భోళా శంకర్’ గ్రాండ్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు దురాభిమాని కూడా కలలో ఊహించని ఘోరమైన వసూళ్లను ఈ సినిమాకే చూస్తున్నాం. టాలీవుడ్ లో మూడు వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలు ఉన్న చిరంజీవి కి ఇలాంటి పరాభవం ఎదురు అవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మెగాస్టార్
మెగాస్టార్

మెహర్ రమేష్ తో సినిమా అన్నప్పుడే మెగా ఫ్యాన్స్ ఈ చిత్రం ఫ్లాప్ అవుతుందని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. కానీ ఎంత చెత్త కంటెంట్ ని అయినా చిరంజీవి మినిమం లాగేస్తాడని నమ్మకం తో ఉండేవారు మెగా ఫ్యాన్స్. కానీ మెహర్ రమేష్ కి ఉన్న చెత్త ఇమేజి, చిరంజీవి స్టార్ స్టేటస్ ని కూడా డామినేట్ చేసేస్తుందని మాత్రం ఈ సినిమా ద్వారానే తెలిసింది. ఇది ఇలా ఉండగా భోళా శంకర్ ఖాతాలో మరో చెత్త రికార్డు నమోదు అయ్యింది.

ఇక అసలు విషయానికి వస్తే నిన్న ఈ చిత్రానికి నైజాం మరియు గుంటూరు వంటి ప్రాంతాలలో జీరో షేర్స్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో కి వారం లోపు ఇలా జరగడం అనేది ఎప్పుడు అవ్వలేదు. ఆచార్య చిత్రం కూడా వారం రోజుల వరకు డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

- Advertisement -

కానీ భోళా శంకర్ చిత్రం మాత్రం 30 కోట్ల రూపాయిల లోపే షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఎప్పుడో వచ్చిన చిరంజీవి ఇంద్ర చిత్రం దాదాపుగా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ‘భోళా శంకర్’ చిత్రం అంతకంటే తక్కువ వసూళ్లు రావడం అనేది మెగాస్టార్ కెరీర్ కి డేంజర్ బెల్స్ సూచిస్తుంది. ఇక నుండి ఆయన రీమేక్స్ ఆపుతాడో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here