Bigg Boss : మిడ్ వీక్ లో యావర్ అవుట్..14 వారాలకు ఆయనకి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా!

- Advertisement -

Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో స్పై మరియు స్పా అని రెండు గ్రూప్స్ గా విడిపోయి, ఎలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆడారో మన అందరం చూసాము. ఈ సీజన్ లో జరిగినన్ని గొడవలు, తిట్టుకున్న బూతులు ఇప్పటి వరకు ఏ సీజన్ లో కూడా జరగలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా షో మొత్తం అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మరియు శివాజీ చుట్టూనే తిరిగింది.

Bigg Boss
Bigg Boss

ఈ ముగ్గురే టాప్ 3 లో కూడా ఉండబోతున్నారు. టైటిల్ అమర్ దీప్ లేదా పల్లవి ప్రశాంత్ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ శివాజీ కి బాగా పాజిటివ్ అవ్వొచ్చు. కాబట్టి శివాజీ కి కూడా టైటిల్ గెలిచేందుకు అవకాశాలు చాలా ఎక్కువ గా ఉన్నాయి. కానీ ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్యనే భారీ పోరు ఉండనుంది.

ఇది ఇలా ఉండగా ఈ వీకెండ్ జరిగిన ఎపిసోడ్ లో శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. ఈ ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూసారో మనమంతా చూసాము. ఈమె తర్వాత అతి తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ యావర్ అట. వచ్చే బుధవారం నాడు యావర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే యావర్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించాడో మనమంతా చూస్తూనే ఉన్నాం.

- Advertisement -

ప్రతీ టాస్కులోను తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తూ ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. కానీ మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే యావర్ జనాలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి కాబట్టి అతనికి రెమ్యూనరేషన్ చాలా తక్కువగానే ఇచ్చారట. 15 వారాలకు కలిపి ఆయనకీ దాదాపుగా 10 లక్షల రూపాయిలు మాత్రమే ఇచ్చారట. శోభా శెట్టి కి దాదాపుగా 28 లక్షలు ఇచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here