Sreeleela టాలీవుడ్ హాట్ బ్యూటీల్లో శ్రీలీల ఒకరు. చాలా తక్కువ సమయంలో అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. గత కొన్నేళ్లలో ఏ హీరోయిన్ కు రానటువంతి క్రేజ్ శ్రీలీల సొంతం. ఆ మధ్య ఏ సినిమా చూసినా శ్రీలీలే కనపడుతోంది. కుర్రహీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరూ ఆమెతో నటించాలని ఉవ్విలూరుతున్నారు. ఇక శ్రీలీల డ్యాన్స్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె పర్సనాలిటీ, అందం.. డ్యాన్స్ చేసే విధానానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ముఖ్యంగా శ్రీలీల ఫిజిక్ కి ఎక్కువ మంది ఫిదా అవుతున్నారడంతో ఎలాంటి సందేహం లేదు. శ్రీలీల తెలుగులో మొదటి సినిమా పెళ్లి సందడి చేసినప్పుడు కొంచెం బొద్దుగా ఉంది. కానీ.. తర్వాతి సినిమాలకు మరింత సన్నబడింది. భగవంత్ కేసరిలో అయితే.. నిజంగా స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలా కనపడింది. అసలు శ్రీలీల తన బాడీని ఎలా మెయింటైన్ చేస్తోందో తెలుసుకుందాం..
శ్రీలీల క్రమం తప్పకుండా ప్రతి రోజూ 45 నిమిషాల పాటు యోగా కి కేటాయిస్తుంది. శ్రీలీల చాలా సినిమాలు చేస్తోంది. ఇంత బిజీ బిజీగా గడిపింది కాబట్టి.. వర్కౌట్స్ చేయడానికి టైమ్ ఉండదు.. వర్కౌట్స్ స్కిప్ చేస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ.. తనకు ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా… వర్కౌట్స్ ని మాత్రం వదిలిపెట్టదట. ట్రావెలింగ్ లో ఉన్నా, సెట్స్ లో ఉన్నా.. ఏదో ఒక సమయంలో.. వర్కౌట్స్ చేసేస్తుందట. భగవంత్ కేసరి మూవీలో శ్రీలీల ఆర్మీ ట్రైనింగ్ కోసం కష్టపడే సీన్స్ ఉంటాయి. దానికోసం ఆమె చాలా వర్కౌట్స్ చేసిందట. అంటే కార్డియో, రోప్ పుల్లింగ్ లాంటివి మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటుందట.
తన మజిల్ స్ట్రైంత్ కోసం ఎక్కువగా బెంచ్ ప్రెస్సెస్, డెడ్ లిఫ్ట్స్, స్క్వాట్స్ లాంటివి ఎక్కువగా చేస్తుందట. ఆహారం విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటుందట. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయదట. ఉదయాన్నే కచ్చితంగా కొబ్బరి నీరు తాగుతుందట. లోఫ్యాట్ జ్యూస్ తాగుతుంది. తర్వాత ఒక వెజిటేబుల్ సాండ్విచ్ తింటుంది. ఒక పండు, ఒక గిన్నెడు సలాడ్ ని కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటుంది. వీటితో పాటు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కినోవా, సెరల్స్ కూడా తీసుకుంటుందట. ఇక.. లంచ్ లో ఎక్కువగా సలాడ్స్, కూరగాయలు, బ్రౌన్ రైస్, పప్పు తీసుకుంటుందట. బాడీ ఎక్కువగా డీ హైడ్రేటెడ్ గా ఉండేందుకు నిమ్మకాయ నీళ్లు తాగుతూ ఉంటుందట. డిన్నర్ లో మాత్రం ఏదైనా వెజిటేబుల్ సూప్, ఏదైనా సలాడ్ తింటారట. శ్రీలీల కాఫీ అంటే చాలా ఇష్టమట. పర్సనల్ కెరీర్ విషయానికి వస్తే.. డాక్టర్ విద్య చదువుతోంది.