Yatra 2 Collections ..జగన్ మేనియా తో మొదటి రోజే బ్రేక్ ఈవెన్..?

- Advertisement -

Yatra 2 Collections : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ బయోపిక్ ని ఆధారంగా తీసుకొని డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర 2 ‘ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రం లో జరిగిన సంఘటనలు, జగన్ కి ఎదురైన సమస్యలు, ఆ సమస్యలను ఛేదించి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు వంటి అంశాలను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చాలా చక్కగా తీసాడు ఆయన.

Yatra 2 Collections
Yatra 2 Collections

కేవలం జగన్ అభిమానులకు మాత్రమే కాదు, సదరు సినీ ప్రేక్షకుడికి ఈ సినిమా ఎంతగానో నచ్చుతుంది. కొన్ని సన్నివేశాలు అయితే ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుంది. అలా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమాకి వసూళ్లు కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి.

Yatra 2

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు దాదాపుగా మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఒక సెక్షన్ ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమాకి ఇంత వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు. కొన్ని ప్రాంతాలలో అయితే బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటేసింది. ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో ఈ సినిమాకి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి లక్ష డాలర్లు వచ్చాయట.

- Advertisement -

లక్ష డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా కోటి రూపాయిల గ్రాస్ అన్నమాట. ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ని దాదాపుగా 25 లక్షలకు కొనుగోలు చేశారట. మొదటి రోజే దాదాపుగా రెండింతల లాభాలు వచ్చాయి అన్నమాట. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 9 కోట్లు వసూలు చెయ్యాలి. వీకెండ్ లోపే ఆ మార్క్ ని దాటుతుందని జగన్ అభిమానులు భావిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com