Nayanthara తెలుగు, తమిళ్ళో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ముందువరుసలో ఉంటుంది.. ఒక్కో సినిమా హిట్ అవ్వడంతో రెమ్యూనరేషన్ అధికంగా తీసుకుంటున్నారు.. ఎంతైనా సరే ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అంటున్నారు.. కేరీర్ మొదట్లో పద్ధతిగా కనిపించింది.. హిట్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో గ్లామర్ ట్రీట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..ఇప్పుడు రోల్స్ ను పక్కన పెట్టేసి.. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే ప్రేక్షకులను
అలరిస్తోంది. అందాల ఆరబోతకు తావు లేకుండా సినిమాలు చేస్తోంది. అలాంటి నయనతార `వాన్ మూవీతో బికినీ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ జోరుగా ప్రచారం జరుగుతుంది.. మామూలుగానే నయన్ కు ఫాలోయింగ్ ఎక్కువే ఇక ఇప్పుడు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..

నయనతార బాలీవుడ్ లో చేస్తున్న డబ్యూ మూవీ ఇది. ఇటీవల ‘పఠాన్’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.షారుఖ్‌కు జోడీగా నయనతార నటిస్తుంటే.. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగిబాబు ఇంకా పలువురు స్టార్స్ కీలకపాత్రలను పోషిస్తున్నాడు. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నాడు. హై బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమాలో నయన్ చాలా హాటుగా కనిపించునుందని తెలుస్తుంది..
షారుఖ్ సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా పఠాన్ లో దీపికా పదుకొనే బికినీ లో అదరగొట్టింది. ఇప్పుడు జవాన్ లోనూ హీరోయిన్ క్యారెక్టర్ లో ఆ రేంజ్ గ్లామర్ షోను నార్త్ ప్రేక్షకులకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్ ను బికినీ షోకు ఒప్పించారట మేకర్స్. అయితే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయన్ ఏకంగా రూ.10కోట్లకు డిమాండ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. నయనతార తో సినిమా అంటే జనాలకు భారీ ఎక్స్పెకటేషన్స్ ఉంటాయో చెప్పనక్కర్లేదు.. ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..