బుల్లితెర కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అమాయకుడిగా కనిపిస్తూ కడుపు ఉబ్బా నవ్వించడంలో యాదమ్మ రాజుకి సాటిరారు ఎవ్వరనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం జబర్దస్త్ షో లో సద్దాం టీమ్ లో చేస్తున్నాడు యాదమ్మ రాజు. అతని భార్య స్టెల్లా అందరికీ సుపరిచతమే. ఒక టీవీ ప్రోగ్రామ్ లో తన భార్యను తీసుకొచ్చి సర్ ప్రైజ్ ఇవ్వడంతో వీరిద్దరి ప్రేమాయణం బయటపడింది. గత ఏడాది ఇద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. స్టెల్లా తన భర్త పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని సైతం రన్ చేస్తోంది.

ఈవెంట్స్ అంటూ తిరుగుతూ ఈ జంటబాగానే డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాము విడాకులు తీసుకుంటున్నాం అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఇది నిజం మాత్రం కాదు.. ఒక షోలో వీరిద్దరూ ఒక థీమ్ గా ఈ జంట విడిపోతున్నట్టు తెలిపింది. ఒక కామెడీ షోలో ప్రతీవారం ఒక టీమ్ తో కామెడీ చేస్తూ ప్రజలకు దగ్గరవుతుంటారు. ఇక ఈ సారి యాదమ్మ రాజు, స్టెల్లా విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఆ కామెడీ షోలో చూపించడం జరిగింది. నీతో నా వల్ల కావడం లేదు నాకు విడాకులు కావాలంటూ యాదమ్మ రాజు భార్య స్టెల్లా అడుగుతుంది. అంతేకాదు.. ఆ విడాకులను ఓ ఫంక్షన్ లా చేయమని చెప్పడంతో ఆ కామెడీ షో స్టార్ట్ అవుతుంది. ఇదంతా ప్రమోషన్స్ స్టంట్ అయినా కూడా కొత్త జంట విడాకులు తీసుకోవడం ఏమాత్రం బాలేదని ఈ ప్రోమోని చూసిన అభిమానులు అందరూ విమర్శిస్తున్నారు.

దీనిపై క్లారిటీని ఇస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను విడుదల చేశారు. దాంట్లో వారిద్దరూ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకు డైవర్స్ ప్రాంక్ అనే తీం ను తీసుకొని చేశామని, అది ఒక కాన్సెప్ట్ లో భాగమని తెలిపారు. అంతేకానీ వారిద్దరూ విడాకులు తీసుకోవట్లేదని స్పష్టం చేశారు. దయచేసి ఈ వార్తలను ఎవరు నమ్మవద్దని, ఉదయం నుండి వారికి చాలా ఫోన్ పాల్స్ కూడా వస్తున్నాయని తెలిపారు. అందరికీ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేసినట్టు పేర్కొన్నారు. వారిద్దరు చాలా సంతోషంగా ఉన్నారని, హ్యాపీగా నీతోనే డాన్స్ షో కోసం డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిపారు.