Samantha : ఇక్కడ మీరు పైన ఈ ఫోటోలోని అమ్మాయిని చూశారా. అచ్చం సమంతలాగే ఉంది కాదా. అలా అని ఆమె సమంత చెల్లి అనుకుంటే పొరపాటే.. సమంతకి ఈ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. కానీ చూడడానికి మాత్రం అచ్చం ఆమెలాగే ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో నెటిజన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. సమంత తన పెళ్లికి ఏ విధంగా అయితే రెడీ అయిందో. అదే విధంగా తన పెళ్లికి రెడీ అయ్యి ఫోటోషూట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అచ్చు గుద్దినట్టు సమంత లాగే దిగిపోవడంతో ఈమె సమంతకి సిస్టర్ లా ఉందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు నిజంగానే సిస్టర్ ఏమో చూడండి మాస్టారు.. ఎటువైపు నుంచి రిలేషన్ ఉందో కొంచెం ఎంక్వైరీ చేయండి అంటూ పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ అమ్మాయి తాలూకా ఫోటో బాగా వైరల్ అవుతుంది.

పొరపాటున ఎవరైనా సరే కచ్చితంగా ఈమెను చూస్తే.. సమంత అనుకోక తప్పదు. అంతలా సమంత లుక్స్ ను దించేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటో సెన్సేషన్ గా మారింది. కాగా హీరోయిన్ సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి మళ్లీ హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . పలు సినిమాలను సైతం నిర్మించడానికి సిద్ధంగా ఉంది.