Kalki : కల్కి సీక్వెల్లో పరుశు రాముడి పాత్రలో కనిపించనున్నస్టార్ హీరో.. నాగ అశ్విన్ నీ ప్లాన్ అదుర్స్

- Advertisement -

Kalki : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898ఏడీ. జూన్ 27న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. మొదటి రోజే ఏకంగా 191కోట్లు కలెక్ట్ చేసింది. సినిమా విజువల్ ఎఫెక్ట్ ఔరా అనిపించేంతగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఈ సినిమాలో పరశురాముడు పాత్ర కోసం ఒక స్టార్ హీరోని నాగ అశ్విన్ అప్రోచ్ సంప్రదించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. డైరెక్టర్ నాగ అశ్విన్ తనదైన విజన్ తో ఓ సపరేట్ వరల్డ్ క్రియేట్ చేసి జనాలను అద్భుతం చూపించాడు.

మహాభారతానికి.. కలియుగాంతానికి మధ్య లింక్ పెడుతూ నేటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కల్కి సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన వాళ్లంతా తమ జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదంటున్నారు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ కు ఏమాత్రం తగ్గదని డైరెక్టర్ నాగ అశ్విన్ ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ క్రమంలోనే కల్కి 2 లో కూడా ప్రతి ఒక్క పాత్రను అంతే రియలిస్టిక్ గా తెరకెక్కించబోతున్నారట మేకర్స్. కల్కి 2 సినిమాలో పరశురాముడు పాత్ర కోసం ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించబోతున్నారట. మొదటి పార్ట్ లో అశ్వద్ధామ ఎలాగైతే కల్కిని కాపాడుకుంటూ వచ్చాడో ఇక రెండవ పార్ట్ లో పరశురాముడు కల్కి కి సరైన యుద్ధ విద్యలను నేర్పుతూ యుద్ధానికి సిద్ధం చేసే విధంగా తన క్యారెక్టర్ ని డిజైన్ చేయబోతున్నాడట నాగ అశ్విన్. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ పాత్ర కోసం చిరంజీవిని అప్రోచ్ అవ్వగా ఆయన ఓకే అన్నారట. దీంతో ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ వచ్చేశాయి.

- Advertisement -

chiranjeevi

ఇక కల్కి సినిమాలో అశ్వద్దామగా అమితా బ్ అదరగొట్టేశారు. ఇంక ఈ సినిమాలో దీపిక పదుకొణె, దిశా పటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఆర్జీవి, రాజేంద్రప్రసాద్, మృణాల్ వంటి నటీనటులు పలు పాత్రలు పోషించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here