Rashmika Mandanna : కన్నడలో కిర్రాక్ పార్టీతో ఇండస్ట్రీకి పరిచయమై.. ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఇంపోర్ట్ అయింది రష్మిక మందన్నా. తర్వాత వచ్చిన గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అందరి దృష్టిలో పడింది. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయిపోయింది. గతేడాది వచ్చిన యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది. యానిమల్ సినిమాతో అద్భుతంగా నటించి మరోసారి తన సత్తా చాటుకుంది. పుష్పతో శ్రీవల్లి, యానిమల్ మూవీతో గీతాంజలి పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం కూడా ఖాళీ లేకుండా బిజీ బిజీగా గడుపుతుంది.
త్వరలో అల్లు అర్జున్.. లెక్కల మాస్టారు సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప2లో నటిస్తుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇవే కాకుండా తాజాగా మరో పాన్ ఇండియన్ మూవీ కుబేర షూటింగ్లో జాయిన్ అయింది ఈ అమ్మడు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నా.. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. దాంట్లో తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటుంది. నిత్యం లేటెస్ట్ ఫోటోస్, వీడియోస్, మూవీ అప్డేట్స్ తన అభిమానుల కోసం చెబుతూనే ఉంటుంది. ఈ అమ్మడు నటన పరంగానే కాదు టాలెంటెడ్ బ్యూటీగా మరో విద్య లోనూ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం రష్మిక పాత వీడియో ఒకటి నెటింట్లో వైరల్ గా మారింది. ఇందులో నేషనల్ క్రష్ స్పానిష్ ఆమ్లెట్ వేస్తూ కనిపించింది. ఆమ్లెట్ తయారు చేసే విధానాన్ని వివరినంటూ చెప్పుకొచ్చింది.
నువ్వుల నూనె, నెయ్యి, బచ్చలకూర, పుట్టగొడుగులు, టెరియాకి సాస్ లాంటి వాటిని ఉపయోగించి ఆమ్లెట్ వేసింది. అయితే ఆమె చేసిన వీడియో నెట్టింట మరోసారి వైరల్ అవుతుండడంతో రష్మికకు వంట వచ్చా.. నువ్వు ఇలా వంట చేయడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. చిన్న చిన్న హీరోయిన్స్ కూడా వంటగదికి చాలా దూరంగా ఉంటారు. అలాంటిది నేషనల్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక వంట గదిలో తానే స్వయంగా వంట చేసుకుంటూ ఆ వీడియోని షేర్ చేయడం అభిమానులను షాక్ అయ్యేలా చేస్తుంది. ఆమె కుకింగ్ టాలెంట్‌కు జనాలు ఫిదా అవుతున్నారు.